Widgets Magazine

అనుష్కకు కరణ్ జోహార్ ఆఫర్... ప్రభాస్ వద్దు స్వీటీ అనేశాడా?

అనుష్క, ప్రభాస్ అనగానే హిట్ పెయిర్ అనే పేరుంది. అంతేకాదు వారి మధ్య రిలేషన్ చాలా చక్కగా వున్నదనే వాదనలు కూడా వున్నాయి. కెరీర్‌కు సంబంధించి కూడా వారు పరస్పరం మాట్లాడుకుంటారనీ, స్వీటీ అనుష్క ఏదైనా ఆఫర్ వస్తే, దాన్ని ప్రభాస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటు

Anushka-prabhas
ivr| Last Modified మంగళవారం, 14 నవంబరు 2017 (13:00 IST)
అనుష్క, ప్రభాస్ అనగానే హిట్ పెయిర్ అనే పేరుంది. అంతేకాదు వారి మధ్య రిలేషన్ చాలా చక్కగా వున్నదనే వాదనలు కూడా వున్నాయి. కెరీర్‌కు సంబంధించి కూడా వారు పరస్పరం మాట్లాడుకుంటారనీ, స్వీటీ అనుష్క ఏదైనా ఆఫర్ వస్తే, దాన్ని ప్రభాస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటుందనే టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వుంది. 
 
ఐతే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తోంది. అదేమిటంటే... అనుష్కకు బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ ఆఫర్ ఇచ్చారట. తన తదుపరి ప్రాజెక్టులో హీరోయిన్‌గా అనుష్కను సంప్రదిస్తే అనుష్క నుంచి నో అనే సమాధానం వచ్చిందట.
 
దీనికి కారణం ప్రభాస్ అని బాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో నటించాలా వద్దా అని అనుష్క తన వెల్ విషర్ అయిన ప్రభాస్ ను సంప్రదించిందట. ప్రభాస్ మాత్రం వెనుకా ముందూ ఆలోచించకుండా ఆ ప్రాజెక్టులో నటించవద్దని చెప్పినట్లు సమాచారం. దీనికి కూడా ఓ కారణం వున్నదని చెపుతున్నారు. కరణ్ జోహార్ తన ప్రాజెక్టులో తొలుత హీరోగా ప్రభాస్ అని చెప్పి పారితోషికం విషయంలో వెనకడుగు వేశాడట. ప్రభాస్ అడిగిన పారితోషికం ఎంతంటే... రూ. 20 కోట్లని బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తోంది.


దీనిపై మరింత చదవండి :