అనుష్క సరికొత్త పేరు శీలవతి
అందరికి బాగా పరిచయమైన పేరు అనుష్క శెట్టి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఆమెకు తెలుగులోనే మరింత పేరు తెచ్చిపెట్టింది. చాలాకాలం నటనకు విరామం ఇచ్చిన ఆమె ప్రభాస్ ప్రెండ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది. ఆమెతో మరోసారి సినిమా చేయడానికి దర్శకుడు క్రిష్ సిద్ధమయ్యాడు. అందుకు ఆమెకూడా అంగీకరించింది.
క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమా పేరు శీలవతి. లేడీ ఓరియెంటెడ్ మూవీ. మహిళా సాదికారత గురించి చెప్పే చిత్రం. కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ లు చేస్తామని అనుష్క గతంలో ప్రకటించింది. సమాచారం ప్రకారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. ఒడిసాలో జరిగిన ఓ మహిళకు జరిగిన ఘటనను తెలుగులో తీయబోతున్నారు. ఇది అనుష్కకు కరెక్ట్ కథ అని నెటిజన్లు ఆమెకు కితాబిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగ భాగం పూర్తయిందని తెలుస్తోంది త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు రానున్నాయి.