Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబు సినిమా కట్ బాబాయ్ సినిమాకు ఓకే... ఎవరు?

గురువారం, 18 జనవరి 2018 (21:51 IST)

Widgets Magazine
boyapati seenu

ఒకరితో సినిమాకు ప్లాన్ చేస్తుంటే మరొక హీరో నుంచి ఫోన్ చేస్తే వెంటనే పరుగెత్తుకుని వెళ్ళడం ఏ డైరెక్టర్ కు సమంజసంగా ఉండదు. అది వృత్తి రీత్యా మోసం చేయడమే. అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదట. పెద్ద హీరో నుంచి ఫోన్ వస్తే ఎగిరి గంతేస్తూ వెళ్ళిపోయాడట బోయపాటి. అయితే అప్పటికే మరో హీరోతో సినిమా ప్లాన్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్ళే సమయంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుని పెద్ద హీరో వద్దకు బోయపాటి వెళ్ళడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రాంచరణ్‌‌తో బోయపాటి ఇప్పటికే ఒక సినిమాను ప్లాన్ చేశాడు. కథ మొత్తాన్ని సిద్థం చేసుకున్నాడు. మరో నెల రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంతలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నుంచి బోయపాటికి ఫోనొచ్చిందట. ఫోన్ వచ్చీ రాగానే ఎగిరి గంతేసినంత పనిచేసి పవన్‌తో సినిమా చేయడానికి సిద్థంగా ఉన్నానంటూ ప్రకటించేశాడు. తన వద్ద ప్రస్తుతం ఉన్నది చిన్న సినిమానేనని పవన్‌తో సినిమా చేసిన తరువాత ఈ సినిమా చేసుకుంటానని చెప్పాడట. 
 
దీంతో బాబు రాంచరణ్‌ సినిమా కాస్త ఆగిపోయి బాబాయ్ పవన్ కళ్యాణ్‌ సినిమా తెరపైకి వచ్చింది. బోయపాటి తీయబోయే సినిమా రాజకీయంగా ఉండాలనేది పవన్ ఆలోచన. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుతున్నానని చెప్పిన పవన్ ప్రస్తుతం రాజకీయాలపైనే సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. అజ్ఞాత వాసి సినిమా తరువాత మళ్ళీ సినిమాలు చేయనని చెప్పిన పవన్ మరో సినిమాకు ప్లాన్ చేస్తుండడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చకు దారితీస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పద్మావత్' చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లను తగులబెడతాం : రాజ్‌పుత్

'పద్మావత్' చిత్ర విడుదలకు ఇంకా అడ్డంకులు తొలగినట్టు కనిపించడం లేదు. ఈ చిత్ర విడుదలకు ...

news

'దిల్ రాజు'కే ఝలక్ ఇచ్చిన సాయిపల్లవి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో 'దిల్' రాజు ఒకరు. గత యేడాది ఏ నిర్మాత కూడా ...

news

వీడి దుంపతెగ... 72 ఏళ్ల బాలీవుడ్ హీరో 4వ పెళ్లి... తనకన్నా 29 ఏళ్ల చిన్నది

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు మామూలే. ఐతే వయసు తేడాతో పెళ్లిళ్లు ...

news

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేదట... మరి డార్లింగా? అనుష్క ఏమంటోంది?

"బాహబలి" చిత్రం కోసం ఐదేళ్ల పాటు కలిసి పని చేసిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల మధ్య ...

Widgets Magazine