శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 22 మే 2018 (13:24 IST)

అరవింద సమేత వీర రాఘవ.. ఎన్టీఆర్ సరసన ఈషా రెబ్బా.. ఎగిరిగంతేసిందట..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగును ఆరంభించిన ఈ సినిమాకి, 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్‌ను ఖరారు చేశా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగును ఆరంభించిన ఈ సినిమాకి, 'అరవింద సమేత వీర రాఘవ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనిపించనుండటం విశేషం. 
 
ఈ సినిమా తొలి అర్థభాగంలో ఎన్టీఆర్ కుటుంబ బంధాలకి విలువనిచ్చే సాఫ్ట్ కేరక్టర్‌లో కనిపిస్తాడట. అయితే ఆయన ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఆసక్తిని రేకెత్తించే యాక్షన్‌తో కూడినదిగా ఉంటుందని టాక్. డిఫరెంట్ షేడ్స్‌లో ఎన్టీఆర్ ఈ సినిమాలో దుమ్మురేపుతాడని సమాచారం. ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ సినిమాలో అచ్చతెలుగమ్మాయికి అవకాశం లభించింది. ఎక్కడా గ్యాప్ లేకుండా ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా అవసరం కావడంతో, తెలుగు బాగా మాట్లాడే హీరోయిన్ కోసం త్రివిక్రమ్.. ఈషా రెబ్బాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
అమీ తుమీలో చేసిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా అయితే ఈ రోల్‌కు చక్కగా సరిపోతుందని త్రివిక్రమ్ భావించారట. ఇక ఈషా రెబ్బాకు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిందట.