స్నేహా ఉల్లాల్‌కి పెళ్లి.. ఎవరిని చేసుకోబోతుందో తెలుసా?

Last Updated: శనివారం, 29 డిశెంబరు 2018 (11:55 IST)
మంచు మనోజ్, వంటి హీరోలతో నటించిన స్నేహా ఉల్లాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. కాస్త అటు ఇటుగా ఐశ్వర్యారాయ్ పోలికలతో కనిపించే స్నేహా ఉల్లాల్.. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది. అయినా టాలీవుడ్‌లో ఆమెకు గుర్తింపు లభించకపోవడం.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారింది. ఇటీవల తన బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది.
 
ఈ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా స్నేహా ఉల్లాల్ ప్రేమలో పడిందని.. ఆమె ప్రియుడి పేరు అవీ మిట్టల్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇతడు ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్. 
 
స్నేహితులైన వీరిద్దరూ ప్రేమలో పడిన విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసునట. అవీ మిట్టల్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా స్నేహా ఉల్లాల్ తరచూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల బీచ్‌లో విహరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని బిటౌన్ టాక్.దీనిపై మరింత చదవండి :