అర్జున్ రెడ్డి వెంటపడిన మణిరత్నం... ఎందుకంటే...

గురువారం, 2 నవంబరు 2017 (21:17 IST)

arjun reddy movie still

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోనే కాదు అటు తమిళం ఇటు హిందీ బాషల్లోను హీరో విజయ్ దేవరకొండ పేరు అమాంతం పెరిగిపోయింది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండకు ప్రస్తుతం అవకాశాలు తన్నుకొస్తున్నాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యల్లో సినిమాలు, మూడు భాషల్లో సినిమా నటించే అవకాశం. 
 
తాజాగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం విజయ్ దేవరకొండ వెంటపడిపోయారు. విజయ్ కోసం ఇప్పటికే మణిరత్నం ఒక కథను కూడా సిద్థం చేసేశారట. విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుందని మణిరత్నం చెబుతున్నారు. దర్శకులని వెళ్ళి హీరోలు కలవడం వినుంటాం. కానీ ఇక్కడ హీరోను దర్శకుడు కలిసి నాకు కొన్ని రోజులు టైం కేటాయించూ అంటూ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి. అది విజయ్ దేవరకొండ టాలెంట్. 
 
ఇప్పుడు వీరిద్దరి కలయికలో రానున్న సినిమాపైన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చాలా రోజుల గ్యాప్ తరువాత మణిరత్నం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను చేయనుండటం అందులో విజయ్ హీరో కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోయిన్ రకుల్‌ యేడాదికి 500 రోజులంటోంది.. ఎందుకు?

పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సంవత్సరానికి ఎన్ని రోజులని. ...

news

వామ్మో అంత రేటా...? పద్మావతి 'పిచ్చి'లో అమెజాన్‌...

దీపికా పదుకునే నటించిన పద్మావతి చిత్రంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ ...

news

విజయ్ 'అదిరింది'కి అరవింద్ అడ్డుపడుతున్నారట... ఎందుకో తెలుసా?

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ...

news

హాలీవుడ్‌కు ధనుష్: ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌గా తెరంగేట్రం..

తమిళ నటుడైన ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం ...