Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు ఆ హీరోతో చేయాలని ఉంది : మెహ్రీన్

సోమవారం, 2 అక్టోబరు 2017 (16:13 IST)

Widgets Magazine

'మహానుభావుడు' సినిమాలో క్యూట్ లుక్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచుకుంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. చేసిన సినిమాలు మూడే అయినా మెహ్రీన్ నటన అంటే యువ ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. మహానుభావుడు సినిమాతో తానేంటే నిరూపించుకున్న మెహ్రీన్ తెలుగు సినీపరిశ్రమలో ఒక హీరోతో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని చెబుతోంది.
Mehreen Kaur Pirzada
 
మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించిన హిందీ భామ మెహ్రీన్ కౌర్ పిర్ జాదా ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. హిందీ, తమిళ సినిమాలు మధ్యలో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో శర్వానంద్ సరసన మహానుభావుడు సినిమాలో నటించిన తర్వాత మెహ్రీన్ దశ తిరిగింది. 
 
సినిమా మంచి విజయంతో ముందుకు దూసుకెళుతుండటంతో పాటు మెహ్రీన్ క్యారెక్టర్ కూడా హైలెట్‌గా నిలవడంతో మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తనకు మహేష్ బాబుతో నటించాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందని, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని వేచి చూస్తున్నానని మెహ్రీన్ చెబుతోంది. మరి మెహ్రీన్ కోరిక ఇప్పట్లో నెరవేరుతుందో లేదో చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఓ మై గాడ్.. లాస్ వెగాస్ కోసం ప్రార్థిస్తున్నా : హీరో నిఖిల్ ట్వీట్

అమెరికాలోని లాస్‌‌వెగాస్‌లో ఉన్న ఓ సంగీత విభావరిలో కాల్పులు చోటుకుని 20 మంది ...

news

ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కండి.. కాస్త అర్థం చేసుకోండి... : హీరో ప్రభాస్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన ప్రభాస్‌ ఎక్కడకు వెళ్లినా ఓ ప్రశ్న తీవ్రంగా ...

news

నా మదిలో పెళ్లి ఆలోచన మొదలైంది : రేణూ దేశాయ్

హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మొదలైందట. ...

news

తమిళ 'అర్జున్ రెడ్డి'గా విక్రమ్ వారసుడు

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందు.. ...

Widgets Magazine