సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (15:42 IST)

పవన్‌కు రూ.40కోట్ల ఆఫర్.. రజనీని బీట్ చేస్తారా? మరి ఎన్నికల సంగతి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో రావాలా? లేకుంటే సినిమాల్లో వచ్చే బంపర్ ఆఫర్లను స్వీకరించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో రావాలా? లేకుంటే సినిమాల్లో వచ్చే బంపర్ ఆఫర్లను స్వీకరించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తర్వాత సినిమాలకు పవన్ గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఆపై జనసేన పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలని పవన్ భావిస్తున్నారు. 
 
పవన్‌తో సినిమా చేయాలని మైత్రీ మూవీస్ చాలా కాలంగా భావిస్తోందట. దీనికోసం రూ.40కోట్ల పారితోషికం ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యిందట. ఈ సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైతే.. రూ. 80 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించాలని భావిస్తున్నారు. ఒక వేళ పవన్ ఓకే చెబితే... దక్షిణాదిన రజనీకాంత్ తర్వాత అంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా పవన్ అవతరిస్తారు.
 
ఇకపోతే.. ఎన్నికలకు ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మైత్రీ మూవీస్ సై అంటున్నారట. అయితే ఎన్నికల వేళ.. పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ చేయాలకుంటున్న పవన్‌కు ఈ ఆఫర్ అయోమయంలో నెట్టేలా చేసింది. మరి పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగుతారా? లేకుంటే పార్టీకి నిధుల కోసం ఈ సినిమాల్లో నటించి.. ఎన్నికల బరిలోకి దిగుతాడా? అనేది సంశయంగా మారింది.