విఘ్నేశ్ శివన్‌తో 100 సినిమాలు పూర్తయ్యాకే పెళ్లి.. అప్పటివరకు..?

Last Updated: గురువారం, 14 ఫిబ్రవరి 2019 (10:40 IST)
కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్, దక్షిణాది లేడీ సూపర్ ప్రేమ, పెళ్లిపై ఎన్నో వదంతులు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం నయనతార పెళ్లిపై కొత్త కథ ప్రచారంలోకి వచ్చింది. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయనతార ప్రేమలో వున్న నేపథ్యంలో.. ఇద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నారని ఇటీవల టాక్ వచ్చింది. తాజాగా విఘ్నేశ్‌తో నయన వివాహం త్వరలో జరుగనుందని ప్రచారం జరుగుతోంది. 
 
తమిళనాట తిరుగులేని హీరోయిన్‌గా మారిన నయనతార.. ఇప్పటికే వివిధ భాషల చిత్రాలతో కలిపి 60 సినిమాల్లో కనిపించింది. అయితే వంద సినిమాల్లో నటించిన తర్వాతే ఆమె వివాహం చేసుకోవాలనుకుంటుందట. 
 
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. మరి వంద సినిమాలు పూర్తయ్యాక నయన పెళ్లి చేసుకుంటుందో.. లేక ఈ ఏడాది లోపు విఘ్నేష్‌తో పెళ్లి చేసుకుని.. అక్షింతలు వేయించుకుంటుందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. మరి నయన వంద సినిమాలు పూర్తయ్యేంతవరకు విఘ్నేశ్ ఆమె కోసం వేచి వుంటాడో లేదో మరి. దీనిపై మరింత చదవండి :