Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవా...? ఎవరాయన? ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సోమవారం, 9 అక్టోబరు 2017 (11:10 IST)

Widgets Magazine

సీనియర్ హీరో రెబల్ స్టార్ నట వారసుడిగా సినీరంగప్రవేశం చేశారు ప్రభాస్. తన పెదనాన్న ద్వారా వచ్చిన బరువైన బాధ్యతను తన భుజస్కందాల ద్వారా మోస్తూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యంగ్ రెబల్ స్టార్‌గా టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నారు.
prabhas-chiranjeevi
 
దర్శక ధీరుడు అద్భుత సృష్టి బాహుబలిలో నటించాక ప్రభాస్ ఖ్యాతి ప్రపంచానికి విస్తరించింది. తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలుగు హీరో స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి తెలియజేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రానికి తన నటనతో ప్రాణం పోశాడు ప్రభాస్. అయితే తాను ఎంత ఎదిగినా ప్రభాస్‌లో కించిత్ గర్వం కూడా ఎవరికీ కనిపించదు. సినీ పరిశ్రమలో తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా, క్రిందిస్థాయిలో ఉన్నవారినైనా డార్లింగ్ అని ఆప్యాయంగా పిలుస్తూ అందరికీ అజాత శత్రువుగా మారిపోయారు ప్రభాస్. అందుకే ప్రభాస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం.
 
ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. సినీ పరిశ్రమలో కంటే ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిరు అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. చిరంజీవి కూడా ప్రభాస్ పైన అభిమానం చూపుతుంటారు. అందుకే బాహుబలి షూటింగ్ సమయంలో నేరుగా వెళ్ళి ప్రభాస్‌తో మాట్లాడి వచ్చారు చిరంజీవి. 
 
చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి స్నేహితులతో ప్రభాస్ మాట్లాడుతూ... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఏ సినిమా ప్రారంభిస్తే ఆ సినిమా ముగిసేంత వరకు నేను ఆయన్ను ఆ క్యారెక్టర్ లోనే ఊహించుకుంటాను. కాబట్టి ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఎవరో తెలియదు.. నాకు తెలిసిన వ్యక్తి 'సైరా నరసింహారెడ్డి' అని స్నేహితులతో అన్నారట. చిరుపై ఎంత ప్రేమ ఉంటే ప్రభాస్ ఇలా చెప్పి ఉంటారని స్నేహితులు అనుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పీకల్లోతు ప్రేమలో రత్తాలు.. కొత్త లవర్‌ను పట్టేసింది..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు అంటూ చిందులేసి తెలుగు ...

news

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్బుమణి కావాలి : చారుహాసన్

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నబంవర్ ...

news

తమన్నా భాటియా లైవ్ చాట్.. తెల్లగా వున్నావని పొగరా?

సినీనటి తమన్నా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది. అయితే ఓ అభిమాని నుంచి అనూహ్య ప్రశ్న ...

news

కమల్ సీఎం కాలేడు.. రజనీకాంత్ రాజకీయాల్లోకి అస్సలు రారు: చారు హాసన్

జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, లెజెండ్ కమల్ హాసన్ సీఎం ...

Widgets Magazine