'ఎన్టీఆర్ బ‌యోపిక్'లో రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ వీరాభిమాని?

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర పైకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుంటే..

rakul preeth singh
srinivas| Last Modified శనివారం, 14 జులై 2018 (20:34 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర పైకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుంటే... ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్రంలో విద్యాబాల‌న్ న‌టిస్తోంది. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ అభిమాని పాత్ర ఉంటుందట‌. 
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... కుంటిసాయి అనే అభిమానికి ఎన్టీఆర్ ప్రత్యేక స్థానం ఇచ్చేవారు. ఆ అభిమానిపై ఎన్టీఆర్‌కి ఎందుకింత ప్రేమ‌..? అత‌ని కోసం ఎన్టీఆర్ ఏం చేసారు..? అనేది ఈ చిత్రంలో చూపించ‌బోతున్నార‌ట‌. కుంటిసాయి పాత్ర‌ను కూడా ఎన్టీఆర్ వీరాభిమానితో చేయించాలి అనుకుంటున్నార‌ట‌. ఈ స‌న్నివేశాలు అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. ఆ పాత్ర ఏంటి అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.దీనిపై మరింత చదవండి :