Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్ : నాగిరెడ్డి పాత్రలో ప్రకాశ్ రాజ్

గురువారం, 12 జులై 2018 (10:58 IST)

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నటిస్తున్నారు. అనేక టాలీవుడ్ ప్రముఖులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు.
nagireddy
 
తాజాగా, విజయ వాహిని స్టూడియోస్ అధినేతగా, దర్శక నిర్మాతగా నాగిరెడ్డి పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నటించనున్నారు. బహుముఖ ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తిగా పేరొందిన నాగిరెడ్డి... తన చిత్రాల కథల ఎంపిక, చిత్రీకరణ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ప్రతి సినిమాను ఆయన ఒక తపస్సులా భావించి పూర్తిచేసేవారు. అందువల్లనే విరామమెరుగని విజయాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి.
 
ఎన్టీఆర్ కెరియర్‌లోనే చెప్పుకోదగిన సినిమాలు కొన్ని ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ఎంత అభిమానమో.. ఆయనంటే ఎన్టీఆర్‌కి అంతటి గౌరవం. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. అందువల్లనే ఎన్టీఆర్ బయోపిక్‌లో నాగిరెడ్డి పాత్రకు చోటుకల్పించారు. ఈ పాత్ర కోసం ప్రకాశ్ రాజ్‌ను ఎంపిక చేశారు. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన విషయం తెల్సిందే. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కమల్ హాసన్‌పై గాయత్రి రఘురాం ఫైర్.. మహిళలు సిగరెట్లు కాల్చితే తప్పేముంది?

తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ లెజెండ్ కమల్ హాసన్‌పై గత ఏడాది బిగ్ బాస్ ...

news

సోనాలి బింద్రే న్యూలుక్... 'పైకి ఎదగడానికి కింద పడుతున్నావంటూ' ఆనంద్ మహీంద్రా ట్వీట్

కేన్సర్ బారినపడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే న్యూలుక్‌లో ...

news

లైవ్ షోలో స్టేజ్‌పై ఆడిపాడిన ఐష్.. దద్దరిల్లిన ఆడిటోరియం (Video)

బాలీవుడ్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై అదరగొట్టింది. ఆడుతూ పాడుతూ ...

news

రాహుల్‌ను కలిసిన 'కాలా' దర్శకుడు... ఎందుకు?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "కాలా" చిత్రానికి ...

Widgets Magazine