ప్రకాష్‌రాజ్‌తో గొడవలా? అదో పెద్ద జోక్.. అనుపమ పరమేశ్వరన్

మంగళవారం, 10 జులై 2018 (15:10 IST)

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య విబేధాలున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనుపమ స్పష్టం చేసింది. తేజ్ ఐ లవ్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ప్రకాష్‌తో గొడవపడిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ తమ మధ్య ఎలాంటి విబేధాల్లేవని ట్విట్టర్లో ప్రకాష్ రాజ్‌తో దిగిన సెల్ఫీని పోస్టు చేస్తూ క్లారిటీ ఇచ్చింది. 
 
ప్ర‌కాష్ రాజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌లిసి తాజాగా హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే సినిమాలో న‌టిస్తున్నారు. రామ్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హలో గురు ప్రేమ కోసమే సినిమా షూటింగ్‌లోనే ప్రకాష్‌ రాజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ల మధ్య గొడవలు జరిగాయని, అనుపమ కంటతడి పెట్టుకున్నారని టాక్ వచ్చింది. 
 
అవన్నీ ఉత్తుత్తివేనని.. ప్రకాష్ రాజ్‌తో గొడవ పెద్ద జోక్ అంటూ అనుపమ వెల్లడించింది. ఎవరో ప్లాన్ ప్రకారం ఈ వదంతులను వ్యాపింపజేశారని, ప్రకాష్ రాజ్ తనకు తండ్రిలాంటి వారని.. ఆయనతో గొడవలంటూ చక్కర్లు కొట్టిన వార్తలు విని చాలా బాధపడ్డానని అనుపమ తెలిపింది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అల్సర్ అణిచేందుకు వంటింటి చిట్కాలు...

ప్రతి ఒక్కరూ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు వివిధ రకాల ఆహార పదార్థాలను ...

news

వాల్‌నట్స్ తీసుకుంటే ఆ మూడు పరార్..?

వాల్‌‌నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజూ గుప్పుడె వాల్‌నట్స్ ...

news

మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే?

గర్భంతో వున్న మహిళలు రోజూ మెంతులను నిత్యం ఏదో రూపంలో ఆహారంలో చేర్చుకుంటే.. ప్రసవం సమయంలో ...

news

వీటిని తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయా?

ఆధునిక జీవనశైలి ఆహార అలవాట్ల వలన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ప్రపంచంలోని 18 శాతం ...