గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (15:38 IST)

పరిటాల సునీతగా బాహుబలి శివగామి..

బాహుబలిలో శివగామిగా నటించిన స్టార్ రమ్యకృష్ణకు బంపర్ ఆఫర్ వచ్చింది. పరిటాల రవి స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమాలో పరిటాల సునీతగా రమ్యకృష్ణ కనిపించబోతుందట. ఏపీ మంత్రి పరిటాల సునీత పాత్రను ఆమె పోషించనున

బాహుబలిలో శివగామిగా నటించిన స్టార్ రమ్యకృష్ణకు బంపర్ ఆఫర్ వచ్చింది. పరిటాల రవి స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమాలో పరిటాల సునీతగా రమ్యకృష్ణ కనిపించబోతుందట. ఏపీ మంత్రి పరిటాల సునీత పాత్రను ఆమె పోషించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇది బయోపిక్ కాదు. నారా రోహిత్ కథానాయకుడిగా 'బాలకృష్ణుడు' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరిటాల రవి జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన కల్పిత కథతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవి భార్యగా రమ్యకృష్ణ నటించనున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లోరూపొందుతోన్న చిత్రం బాల‌కృష్ణుడు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాపై నిర్మాతలు మాట్లాడుతూ - నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా బాల‌కృష్ణుడులో ఆకట్టుకుంటాడని చెప్పారు.

అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా ఇది రూపొందుతోందని తెలిపారు. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషమని తెలిపారు.