రేణూ దేశాయ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే రోజు..?

మంగళవారం, 14 నవంబరు 2017 (17:31 IST)

Renu Desai

రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత పాపులారిటీ వున్నదో అదేస్థాయిలో ఆయన మాజీ భార్య అయిన రేణూ దేశాయ్‌కు కూడా వున్నదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలాగైతే తన మనసులో వున్న భావాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్తారో అలాగే రేణూ దేశాయ్ కూడా తన ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో చెప్పేస్తుంటారు. 
 
ఇకపోతే రేణూ దేశాయ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించడమేమిటి అనేదాని విషయానికి వస్తే... ప్రస్తుతం రేణూ దేశాయ్ ఓ మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతేకాదు... అన్నీ పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. తనకు మొదట్నుంచి నటన కంటే దర్శకత్వం అంటేనే ఎంతో ఇష్టమని రేణూ దేశాయ్ చెపుతుంటారు. అందువల్లే ఆమె డైరెక్షన్ పైన టార్గెట్ పెట్టారు.
 
ఆమె అభిరుచిని తెలుసుకున్న పలువురు నిర్మాతలు ఆమెకు దర్శకత్వం బాధ్యతను ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. ప్రస్తుతం మలయాళంలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ఓ నిర్మాత ఉత్సాహం చూపుతున్నారట. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే... ఆ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నారట. మరి ఇది నిజంగానే తెరకెక్కితే చిత్రం మామూలుగా వుండదు కదూ?దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్ (వీడియో)

బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ...

news

మెహ్రీన్ హవా మాములుగా లేదు... (వీడియో)

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి ...

news

డైరెక్టర్ కుమార్తెను బుట్టలో పడేసిన హీరో అఖిల్!

"అఖిల్‌"గా వెండితెర అరంగేట్రం చేసిన హీరో అఖిల్ అక్కినేని. అక్కినేని వారసుడిగా తెలుగు ...

news

బాలీవుడ్‌లో "పద్మావతి" రచ్చ : రిలీజ్ వద్దు... విడుదల చేయాల్సిందే...

బాలీవుడ్‌లో 'పద్మావతి' మూవీ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ...