Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''అజ్ఞాతవాసి'' నిర్మాతపై ప్రశంసలు.. డిస్ట్రిబ్యూటర్లను అలా ఆదుకున్నాడట..

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (17:15 IST)

Widgets Magazine

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరుకుపోయారు. అయితే భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేశారు.

కానీ ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో.. ప్రాంతాల వారీగా తీసుకున్నవారంతా నష్టాల్లో మునిగిపోయారు. ఫలితంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.14కోట్ల మేర నష్టపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో నిర్మాత రాధాకృష్ణ ప్రయత్నాలు చేపట్టారట. ఆ నష్టాల నుంచి వాళ్లను గట్టెక్కించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దిల్ రాజుకు రాధాకృష్ణ రూ.7 కోట్ల వరకు చెల్లించారని టాక్ వస్తోంది. అలాగే మిగిలిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయని.. వారందరికీ రాధాకృష్ణ కొంత నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం.
 
మరికొంతమందికి తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన కమిట్‌మెంట్లు ఇస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అజ్ఞాతవాసి నిర్మాత తీసుకున్న నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేయడంతో పాటు రాధాకృష్ణను అభినందిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గాయత్రి సినిమా రివ్యూ: ఆ ప్రేక్షకులకు ఓకే.. మోహన్ బాబు, శ్రియ, విష్ణు నటన అదుర్స్

మోహ‌న్‌బాబు శివాజీగానూ, గాయ‌త్రీ ప‌టేల్‌గానూ రెండు పాత్ర‌ల్లోనూ మెప్పించారు. ఫైట్స్ ...

news

సాయిధరమ్ తేజ్ 'ఇంటెలిజెంట్' ఔనా? కాదా? (రివ్యూ రిపోర్ట్)

మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మినిమమ్ గ్యారెంటీ ...

news

''పద్మావత్'' కలెక్షన్ల సునామీ.. రూ.231 కోట్ల నెట్‌తో అదుర్స్

సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించిన ''పద్మావత్'' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పలు ...

news

''అర్జున్ రెడ్డి''ని అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్న దర్శకనిర్మాతలు..

''అర్జున్ రెడ్డి'' సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఆరేడు ...

Widgets Magazine