శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (12:56 IST)

సమంత ''యూటర్న్'' తీసుకుందా.. లేడిఓరియెంటెడ్ సినిమాలపై?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ప్రస్తుతం హిట్స్ రారాణిగా మారిపోయింది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన సమంత ప్రస్తుతం యు టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ప్రస్తుతం హిట్స్ రారాణిగా మారిపోయింది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన సమంత ప్రస్తుతం యు టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది మధ్యభాగంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం వుంది. 
 
ప్రస్తుతం హీరోయిన్‌గా నటించేందుకు అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సమంత.. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాలై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ''అర్జున్ రెడ్డి'' సినిమాకు సహాయకుడిగా పనిచేసిన గిరిసయ్య అనే వ్యక్తి దర్శకత్వం వహించే కొత్త సినిమాలో సమంత నటింటనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.