అక్కినేని ఇంట వారసుడు రాబోతున్నాడా? సినిమాలకు సమంత గుడ్ బై?

అందాల తార సమంత ప్రస్తుతం సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పనున్నట్లు ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎనిమిదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో హిట్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సినిమాలను

samantha-naga chaitanya
selvi| Last Updated: శుక్రవారం, 6 జులై 2018 (17:22 IST)
అందాల తార సమంత ప్రస్తుతం సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పనున్నట్లు ఫిలిమ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎనిమిదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో హిట్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సినిమాలను వదిలేసుకుంటుందని టాక్. ఇప్పటివరకు చేతిలో వున్న సినిమాలను పూర్తి చేశాక.. గ్లామర్ ఇండస్ట్రీ నుంచి తప్పుకోనున్నట్లు టాక్. 
 
పెళ్లి తర్వాత రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి చిత్రాలు చేసింది సమంత. అవన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. దీంతో సమంత సినిమాల్లో కొనసాగుతుందని ఫ్యాన్స్ భావించారు. ప్రస్తుతం తెలుగు, తమిళం ఒక్కో ప్రాజెక్ట్ చేస్తోంది. ఈ రెండూ మార్చి నాటికి పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పనుందని సమాచారం. 
 
అంతేగాకుండా అక్కినేని ఇంట నాలుగో తరం వారసుడు త్వరలోనే రాబోతున్నాడా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పెళ్లికి తర్వాత సినిమాలకు దూరంగా వుండాలని చైతూ ఫ్యామిలీ చెప్పిందట. 
 
ఇప్పటికప్పుడు మానేస్తే బాగుండదని.. కొంతగ్యాప్ తీసుకుని డ్రాపైతే బెటరన్న సమంత సలహాతో అక్కినేని ఫ్యామిలీ ఏకీభవించిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కానీ సమంత మాత్రం పలు ఇంటర్వ్యూల్లో సినిమాలను వదిలిపెట్టేది లేదని.. పెళ్లైనా సినిమాలకు దూరం కానని చెప్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చైతూ, నాగార్జున మాత్రం సినిమాల్లో నటించాలా వద్దా అనే నిర్ణయాన్ని సమంతకే వదిలేసినట్లు తెలుస్తోంది. ఆమెకు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా స్వేచ్ఛనిచ్చారని టాక్. మరి సమంత ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. దీనిపై మరింత చదవండి :