గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (20:26 IST)

యూట్యూబ్‌లో శ్రీరెడ్డి అంత సంపాదిస్తుందా?

Srireddy
శ్రీరెడ్డి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అంతా అంతా కాదు. తాజాగా యూట్యూబ్‌లో శ్రీరెడ్డి ఏ చిన్న వీడియో షేర్ చేసిన కూడా లక్షల్లో ప్రేక్షకులు చూస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి నెలకు 7 నుండి 8 లక్షల రూపాయలు సంపాదిస్తుందట. శ్రీరెడ్డి యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది. 
 
ఈ మధ్య శ్రీ రెడ్డి పీతలు, రొయ్యలు, ఎండుచేపలు వంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా బిర్యానీ చేసే విధానం.. వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేసింది.