Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజకీయాలు ఇష్టమే గురు... పార్లమెంట్‌లో కలియతిరిగిన అంజలి

మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:30 IST)

Widgets Magazine

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి పార్లమెంటులో కాలుపెట్టింది.  మోడలింగ్ రంగం నుంచి వెండితెరమీద తానేంటో నిరూపించుకున్న అంజలి.. ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జైతో ప్రేమాయణం నడుపుతోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలపై కన్నేసిన అంజలి షూటింగ్‌ల్లో బిజీ బిజీ అయిపోయింది.

అయితే, పార్లమెంట్ చూడాలని ఎన్నాళ్లనుంచో ఉన్న కోర్కెను కూడా తీర్చేసుకుంది అంజలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో కలిసి అంజలి పార్లమెంట్‌ను సందర్శించింది. పార్లమెంట్ భవనాన్ని కలియతిరిగి ఆవరణలో ఎంపీ గీతతో కలిసి ఫొటోలు దిగి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
జమ్మూకశ్మీర్‌‌లోని వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్లిన అంజలి... త్రికూట పర్వతాల్లో కత్రా నుంచి 13.5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అమ్మవారిని దర్శించుకుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో దిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా అంజలి తనకు రాజకీయాలు అంటే ఇష్టమేనని చెప్పింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అంటే మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ధనుష్ - అమలాపాల్ 'రతి' వీడియో.. చూడాలని ఉవ్విళ్లూరుతున్న హీరోయిన్?

తమిళ హీరో హీరో ధనుష్, అమలాపాల్, కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం వీఐపీ-2. ఈ చిత్రానికి ...

news

అబ్బే.. జోగేంద్ర లాంటి భర్త వద్దే వద్దు.. రాజకీయ నాయకుడిని పెళ్ళాడను: కాజల్ అగర్వాల్

''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా గురించి టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆసక్తికర విషయాలు ...

news

నా 'దేవుడు' నిర్మాతగా సినిమా చేస్తున్నా... ఎవరా దేవుడు... ఎవరా హీరో?

సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఓ రేంజిలో వుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ...

news

సామాజిక సేవలో కాజల్ అగర్వాల్... షార్ట్ ఫిలిమ్ వీడియో చూడండి..

టాలీవుడ్ అగ్ర నటి, దక్షిణాది చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షార్ట్ ఫిలిమ్‌లో నటించింది. ...

Widgets Magazine