ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (14:54 IST)

నటి భానుప్రియ మాజీ భర్త మృతి

సీనియర్ నటి భానుప్రియ మాజీ భర్త చనిపోయారు. ఆయన పేరు ఆదర్శ్ కౌశల్. ఆదర్శ్‌తో భానుప్రియ వివాహం గత 1998 సంవత్సరంలో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా అభినయ అనే కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వీరిద్

సీనియర్ నటి భానుప్రియ మాజీ భర్త చనిపోయారు. ఆయన పేరు ఆదర్శ్ కౌశల్. ఆదర్శ్‌తో భానుప్రియ వివాహం గత 1998 సంవత్సరంలో జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా అభినయ అనే కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత వీరిద్దరూ 2005 సంవత్సరంలో విడిపోయారు. 
 
దీంతో భానుప్రియ తన కుమార్తెతో కలిసి స్వదేశానికి తిరిగివచ్చేసింది. కానీ, ఆదర్శ్ మాత్రం అమెరికాలోనే స్థిరపడిపోయారు. అక్కడే ఉంటూ వచ్చిన ఆయన గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల చనిపోగా, ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే భానుప్రియ అమెరికాకు వెళ్లింది.