1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (11:28 IST)

సీనియర్ నటి టి.కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి సీనియర్ నటి, హీరోయిన్ కృష్ణకుమారి బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 83 యేళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. ఈమె మృతిపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్య

అలనాటి సీనియర్ నటి, హీరోయిన్ కృష్ణకుమారి బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 83 యేళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. ఈమె మృతిపై తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
 
ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, కాంతరావు, శివాజీ గణేశన్ వంటి అగ్రహీరోలతో నటించారు. దేవాదాసు, బందిపోటు, చిక్కడు దొరకడు వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 
 
కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్‌లోని నైహతిలో 1933, మార్చి 6వ తేదీన జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి దీపిక అనే కుమార్తె ఉన్నారు. 
 
"నవ్వితే నవరత్నాలు" సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈమె ఈమె పిచ్చి పుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆప్తమిత్రులు, అంతస్తులు, శ్రీకృష్ణావతారం, చిక్కడు దొరకడు, వరకట్నం, బంగారు భూమి, బందిపోటు తదితర సినిమాలతో సహా దాదాపు 110కి పైగా చిత్రాల్లో నటించారు.