Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిడిల్ క్లాస్ అమ్మాయిని... లిప్‌లాక్‌కు పారెంట్స్ ఒప్పుకోరు : సాయి పల్లవి

మంగళవారం, 16 జనవరి 2018 (13:32 IST)

Widgets Magazine
sai pallavi

ఫిదా హీరోయిన్ సాయి పల్లవి. నిజంగానే సింగిల్‌ పీస్‌. ఆమెను ఎవరితోనూ పోల్చలేం. పక్కా హైబ్రీడ్‌ పిల్ల. మలయాళీగా, తెలంగాణా పోరిగా, తమిళ పొన్నుగా ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. అసలా అమ్మాయిని చూస్తే హీరోయిన్‌ అనుకోరు. కానీ, "ఫిదా" చిత్రంలో తెలంగాణ పిల్లగా ఇట్టే ఒదిగిపోయింది. దీంతో ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. 
 
అయితే, ఒక చిత్రానికి ఓకే చెప్పేందుకు ఈమె ఎక్కడలేని కండీషన్లు పెడుతుందనే ప్రచారం ఉంది. దీనిపై సాయి పల్లవి తాజాగా స్పందిస్తూ, కొందరి దృష్టిలో అందాల ఆరబోతనే గ్లామర్‌ అనుకుంటారు. అలా అనుకుని నా దగ్గరకు కొందరు వచ్చారు కూడా! వారి ఉద్దేశం అర్థమయ్యే వారి సినిమాలు చేయను. గ్లామర్‌ పేరుతో అందాల ఆరబోత నాకు ఇష్టం ఉండదు. అవే కండిషన్లు అనుకుంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. 
 
ఒక చిత్రానికి నా దృష్టిలో కథనే హీరో. మిగతా వారంతా నటులే! ఆ హీరో గురించి తెలుసుకోకుండా ఎలా ఓకే చెబుతాను. నా పక్కన ఎవరు చేస్తున్నారు? అన్నది పట్టించుకోను. ఇవన్నీ చెబితే కండిషన్లంటారు! ఇక లిప్‌లాక్‌లు లాంటివి నా వల్ల కాదు. నేను మధ్య తరగతి అమ్మాయిని. అలాంటి వాటికి మా పేరెంట్స్‌ అస్సలు ఒప్పుకోరు. నేను సినిమాలు చేస్తానంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు. అందులో లిప్‌లాక్‌లు ఒకటి. అందుకే ఆ తరహా సీన్లకు దూరంగా ఉంటున్నాను అని చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాని ''కృష్ణార్జున యుద్ధం'': 'దారి చూడు' తొలి సాంగ్ అదిరింది.. (వీడియో)

సంక్రాంతి సందర్భంగా నేచురల్ స్టార్ నాని ''కృష్ణార్జున యుద్ధం'' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ ...

news

హాహా.. బొలెరో కార్లను ఎత్తడానికి హైడ్రాలిక్ లిఫ్ట్‌లక్కర్లేదు.. బాలయ్య ఉన్నాడట...

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ...

news

పులిహోర చేసిన యాంకర్ సుమ కనకాల (video)

యాంకరింగ్‌తో నవ్వులు పూయించే సుమ కనకాల.. తాజాగా చింతపండు పులిహోరను తయారు చేసింది. ఆ ...

news

గ్రహానుకూలత కోసం మంత్రాలయంలో రాజమౌళి పూజలు..?

బాహుబలి మేకర్ దర్శకుడు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త అటు ఫిలిమ్ నగర్‌లోనూ ఇటు సోషల్ ...

Widgets Magazine