సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (09:30 IST)

ఐరెన్ లెగ్ అయితే ఛాన్సులు ఎందుకిస్తున్నారు... రకుల్ ప్రీత్

తనది ఐరెన్ లెగ్ అయితే, తనకు దర్శకనిర్మాతలు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రశ్నించారు. టాలీవుడ్‌లో స్టార్ స్టేట‌స్ పొంది ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన హీరోయిన్ రకుల్‌కు బాలీవుడ్‌లో మరో ఛాన్స్ దక్కింది. 
 
ప్ర‌స్తుతం కార్తీ స‌ర‌స‌న "దేవ్" అనే చిత్రంలో న‌టిస్తుండ‌గా, 'ఎన్‌జీకే' అనే చిత్రంలో సూర్యతో జ‌త‌క‌ట్టింది. అయితే ర‌కుల్ దృష్టి బాలీవుడ్‌పై కూడా ఉండడంతో అప్ప‌ట్లో 'అయ్యారి' అనే సినిమాతో హిందీ ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం ఇచ్చింది. ఈ సినిమా ర‌కుల్‌ని సంతృప్తి ప‌ర‌చ‌క‌పోవ‌డంతో మ‌రో సారి అక్క‌డ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. 
 
సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న "మర్జావాన్‌" సినిమాలో రకుల్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రంలో రెండో సారి సిద్ధార్ధ్ మ‌ల్హోత్రాతో రెండో సారి జ‌త‌క‌ట్ట‌నుంది. మిల‌ప్ మిల‌న్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌ర్జావాన్ సినిమాని టీ సిరీస్‌తో క‌లిసి నిఖిల్ అద్వాని నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. వ‌చ్చే ఏడాది అక్టోబరు 2వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకురానుంది.