శ్రీనువైట్ల కిడ్స్‌తో ఇలియానా.. అమెరికాలో ఏం చేస్తోందో తెలుసా?

శుక్రవారం, 13 జులై 2018 (13:38 IST)

టాలీవుడ్‌లో ''దేవదాసు'' సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టిన ఇలియానా ఆపై.. వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా దక్షిణాది అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న ఇలియానా రవితేజతో చేసిన ''దేవుడు చేసిన మనుషులు'' తర్వాత టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ ఈ గోవా బ్యూటీ నాలుగైదు సినిమాలుచేసింది. ప్రస్తుతం మళ్లీ సినిమా ''అమర్ అక్బర్ ఆంటోనీ'' ద్వారానే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 
 
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ''అమర్ అక్బర్ ఆంటోని'' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో ఇలియానా పాల్గొంది. ఈ షూటింగ్‌లో రవితేజ, ఇలియానా కాంబినేషన్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం కుటుంబం కూడా అమెరికా వచ్చింది. 
 
ఈ సందర్భంగా షూటింగులో జాయిన్ అయిన ఇలియానాకి స్పెషల్‌గా పిల్లలు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. వాళ్లు చూపించిన ప్రేమానురాగాలకు ఇలియానా మురిసిపోతూ థ్యాంక్స్ చెప్పింది. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
 
మరోవైపు ఇలియానా తన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తోంది. ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై క్లారిటీ ఇవ్వమంటే... అది తన వ్యక్తిగతమని దాటవేసింది. అంతేగాకుండా.. ఇటీవల హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన టాప్‌లెస్ ఫోటోతో పాటు దాని కింద చేసిన కామెంట్ హాట్ టాపికైన సంగతి తెలిసిందే.



దీనిపై మరింత చదవండి :  
శ్రీనువైట్ల ఇలియానా రవితేజ అమెరికా గోవా బాలీవుడ్ Welcome Tollywood Srinuvaitla America Goa Bollywood Amar Akbar Anthony Ileana D’cruz

Loading comments ...

తెలుగు సినిమా

news

లారెన్స్ నన్ను ఏవేవో చూపించమని కోరాడు... బెల్లంకొండ విలన్... శ్రీరెడ్డి షాకింగ్

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. ఈసారి లారెన్స్ పేరును బయటకు తెచ్చింది. డాన్స్ డైరెక్టర్, ...

news

చిరంజీవి "సైరా"కు తాత్కాలిక బ్రేక్... మెగా బర్త్‌డే రోజున ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ ...

news

#RX100 కలెక్షన్ల సునామీ ... ఒక్క రోజుకే రూ. 1.42 కోట్లు... ఎందుకు ఎగబడుతున్నారు?

అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన RX100 చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్ని ...

news

త్రిష ''96'' అదిరింది.. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.. (వీడియో)

త్రిషకు వయసైపోయింది. లేటు వయసులో ఆఫర్లు రావట్లేదని కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. సామి ...