Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:16 IST)

Widgets Magazine
anasuya

యాంకర్, నటి సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ను పగులకొట్టడమే కాకుండా.. దుర్భాషలాడిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
కానీ ఈ వ్యవహారంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఫోన్ పగులకొట్టినందుకు క్షమాపణలు కూడా అడిగింది. కానీ ఫోన్ పగిలిందా లేదా అని తాను గమనించలేదని చెప్పింది. ఇంతలో ట్విట్టర్లో ఓ యువకుడు అనసూయ ఫోన్ పగులకొట్టడాన్ని తాను చూశానని ట్వీట్ చేశాడు. ఆ యువకుడి వద్ద విచారిస్తామని పోలీసులు కూడా హామీ ఇచ్చారు. దీంతో నెటిజన్లు అనసూయపై తిట్ల వర్షం కురిపించారు. 
 
క్షమాపణలు చెప్పినా చిన్నారి అభిమాని ఫోన్ పగులకొట్టిన వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. అనసూయ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతే సోషల్ మీడియా వద్దు ఏమీ వద్దు అనుకుంది. నెటిజన్ల విమర్శలకు మనస్తాపానికి గురైన అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అనసూయ అకౌంట్స్ కనిపించట్లేదు. మొత్తానికి సెల్ ఫోన్ వ్యవహారంతో అనసూయ హర్టయ్యిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యవహారంలో నెటిజన్లు ఓవరాక్షన్ చేశారని వారు మండిపడుతున్నారు.
 
ఇకపోతే.. బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం రామ్‌ చరణ్ రంగస్థలం, మోహన్ బాబు గాయత్రి సినిమాలతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న ''సచ్చిందిరా గొర్రె'' సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
అనసూయ సోషల్ మీడియా సెల్ఫీ హైదరాబాద్ Hyderabad Selfie Phone Anchor Anasuya Quits Tarnaka Social Media

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీకాంత్ ప్రధాన మంత్రి అయితే ఇంకేముంది?: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆసక్తికర కామెంట్స్ ...

news

అనసూయ ఫోన్‌ను పగులకొట్టింది.. నేను కళ్లారా చూశాను

యాంకర్ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టిన వ్యవహారం ఆమెను ...

news

40 దాటిన హీరోలతో చేయనంటున్న హీరోయిన్.. ఎవరు?

ఈమధ్య కాలంలో వయస్సు పైబడిన హీరోలను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు హీరోయిన్లు. సినిమా ...

news

జిమిక్కి కమ్మల్ ఇంగ్లీష్ లిరిక్స్.. స్టెప్పులేసిన రష్యన్ డ్యాన్సర్లు (వీడియో)

మలయాళ సూపర్ స్టార్ నటించిన ''వెలిపడింటే పుస్తకం'' సినిమాలోని ''జిమిక్కి కమ్మల్'' పాట ...

Widgets Magazine