Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైపర్ ఆదికి నేనున్నా... అండగా నిలిచిన అనసూయ

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:10 IST)

Widgets Magazine
anasuya

మొన్నీమధ్య ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనాథలను ఉద్దేశించి చెప్పిన ఒక డైలాగ్ వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే విషయంపై కొంతమంది అనాథలు హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటివరకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ వ్యవహారంపై స్పందిస్తే అనసూయ తాజాగా స్పందించారు. 
 
మనమంతా ఎంటర్టైన్‌మెంట్ వరల్డ్‌లో ఉన్నాం. ఈ వరల్డ్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షో జబర్దస్త్. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. తెలుగు రాష్ట్రాలోనో, లేక దక్షిణాదిలోనో కాదు భారతదేశంలో హిస్టరీ క్రియేట్ చేసిన షో ఏదైనా వుందీ అంటే అది జబర్దస్త్ మాత్రమే. ఎందుకంటే ఒకేసారి ఇంత హిట్ అయిన షో మరొకటి లేదు. దీనిగురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే చెబుతున్నా. వెండితెరపై బాహుబలి ఎలా కొత్త ట్రెండ్‌ను సృష్టించిందో బుల్లితెరపై జబర్దస్త్ అంతే ట్రెండ్‌ను సృష్టించింది. 
 
ఈ షో కోసం రోజా, నాగబాబులు చాలా కష్టపడుతున్నారు. అయితే కొంతమంది ఈ షోను ఆపేవాలని, నిర్భంధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్రియేటివిటిని తొక్కేయవద్దు, ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడొద్దండి. గుమ్మడికాయ దొంగలు అంటే మీరెందుకు భుజాలు తడుముకొంటున్నారు. ఆ స్కిట్లో హైపర్ ఆది అందరూ అనాథలను ఉద్దేశించింది చెప్పింది కాదు. కొంతమందిని మాత్రమే ఉద్దేశించి చెప్పింది. ఆ స్కిట్లో ఉన్నవారిని గురించి చెప్పింది మాత్రమే. దీని గురించి బాగా ఆలోచించండి.. అనవసర రాద్దాంతం చేయొద్దంటూ సామాజిక మాథ్యమాల ద్వారా పోస్ట్ చేసింది అనసూయ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కులం పేరు చెబితే దాంతో కొట్టండి - రకుల్ ప్రీత్ సింగ్

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కోపమొచ్చింది. కులం గోడలను కూల్చేద్దామంటూ ఒక టీవీ ఛానల్ ...

news

ఆర్కే నగర్ బై పోల్ : స్వతంత్ర అభ్యర్థిగా హీరో విశాల్?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఈనెల 21వ తేదీన ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ...

news

అజ్ఞాతవాసి కథ లీక్... త్రివిక్రమ్ ఆగ్రహం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న అజ్ఞాత వాసి సినిమా కథ లీకయ్యింది. ఇప్పుడు ఎక్కడ ...

news

సన్నజాజిలా మారిన అనుష్క.. అజిత్ విశ్వాసంలో నటిస్తోందట..

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి అజిత్ సినిమాలో కనిపించనుందని తెలిసింది. ఎంతవాడు కానీ ...

Widgets Magazine