Widgets Magazine

ఉన్మాదిగా మారిన బిగ్‌ బాస్ పార్టిసిపెంట్ అర్మాన్.. సహజీవన భాగస్వామిపై?

మంగళవారం, 5 జూన్ 2018 (11:58 IST)

బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్న వేళ, కో-పార్టిసిపెంట్‌ తనీషా ముఖర్జీతో రొమాన్స్‌ చేసిన అర్మాన్‌ను హౌస్ నుంచి గెంటేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ పోటీదారు అర్మాన్ కోహ్లీ తన సహజీవన భాగస్వామిపై దాడి చేశాడు. వివాదాస్పద నటుడైన అర్మాన్ కోహ్లీ.. తన సహజీవన భాగస్వామి ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను హింసించాడు. దాడి చేశాడు. దీంతో గాయాలకు గురైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
నీరూను దారుణంగా కొట్టిన అర్మాన్, ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గత మూడేళ్లుగా నీరు, అర్మాన్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధిత అంశాలపై గొడవలు జరుగుతున్నాయి. గోవాలోని ఓ విల్లా అమ్మకం విషయంలో విభేదాలు తారస్థాయికి చేరగా, ఆదివారం రాత్రి, ఉన్మాదిలా మారిన కోహ్లీ, నీరూను జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. మెట్లపై నుంచి ఆమె జారి కిందపడింది. 
 
నీరూపై దాడి చేసిన కోహ్లీ ఆమెను బతిమాలుకున్నా.. ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. చాలాసేపటికి తేరుకుని ఆసుపత్రికి చేరుకున్న ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మా ఆయన నాకోసం పూలు తెచ్చారు... మురిసిపోయిన ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అంటే ఆయన సతీమణి ఉపాసనకు ఎక్కడలేని ఇష్టం. అందుకే ఎపుడు సమయం, ...

news

బిగ్‌బాస్‌-2లో శ్రీరెడ్డి.. పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?

బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి గత కొంతకాలంగా ...

news

'కొత్త బంగారులోకం' హీరోయిన్‌కు నిశ్చితార్థం జరిగిపోయింది...

'కొత్త బంగారులోకం' చిత్రంతో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ శ్వేతా బసుప్రసాద్. ఈమెకు ...

news

బిగ్ బాస్ సీజన్-2లో నందమూరి తారకరత్న..?

బిగ్ బాస్ సీజన్-2కి రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా ...

Widgets Magazine