Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పైలట్ గర్ల్ ఫ్రెండ్‌కి ఎలా ప్రపోజ్ చేశాడో చూడండి

బుధవారం, 3 జనవరి 2018 (11:13 IST)

Widgets Magazine

సోషల్ మీడియా ప్రభావంతో ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రేమికులు కొత్త కొత్తదారులను వెతుకుతూ వున్నారు. ఇప్పటికే విమానంలో ఎగురుతూ లవ్ ప్రపోజ్ చేయడం, ప్రియురాలికి నచ్చిన వస్తువులు కొనిపెట్టి తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ పైల‌ట్ త‌న ప్రియురాలికి ప్ర‌పోజ్ చేసిన విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.  
 
డిసెంబర్ 23న పైల‌ట్ జాన్ ఎమ‌ర్స‌న్‌, ఫ్లైట్ అటెండెంట్ లారెన్ గిబ్స్‌లు డెట్రాయిట్ నుంచి ఒక్లాహామా సిటీకి వెళ్తున్న విమానంలో త‌మ త‌మ విధుల్లో నిమ‌గ్న‌మై ఉన్నారు. విమాన ప్ర‌యాణం గురించి మైకులో ఎమ‌ర్స‌న్ ప్ర‌యాణికులకు సూచ‌న‌లు చేస్తున్నాడు. ఆ సూచ‌న‌ల్లో భాగంగా లారెన్ గురించి ప్ర‌స్తావించాడు. అలాగే లారెన్‌కి ప్రపోజ్ కూడా చేశాడు. 
 
ఇది విని... డైమండ్ రింగుతో ప్రపోజ్ చేయడంతో లారెన్ పొంగిపోయింది. ఇంకా ఎమర్సన్ ప్రపోజల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్యాయంగా ప్రేమికుడికి ముద్దెట్టి.. కౌగిలించుకుంది. లారెన్ ఎమర్సెన్ ప్రేమకు పచ్చాజెండా ఊపటంతో ప్ర‌యాణికులంతా లేచి చ‌ప్ప‌ట్లు కొడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'గజల్' భార్యకు కూడా చెప్పాను.. పార్వతికి భర్త ఉన్నా 'శ్రీనివాస్‌'తో...

'గజల్' కళాకారుడు 'గజల్' శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తనను ...

news

అమ్మ వీడియోపై 100 ప్రశ్నలు.. తడబడిన శశికళ మేనకోడలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు.. టీటీవీ దినకరన్ ...

news

భారతీయుల మెడపై ట్రంప్ కత్తి : హెచ్‌1బీ వీసాల్లో కోత

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. హెచ్1బీ వీసాల్లో భారీ ...

news

అణ్వస్త్ర బటన్ కిమ్ టేబుల్ పైన వుందా? అలాంటి బటన్లు నా చేతుల్లోనే వుంటాయి... ట్రంప్

ఉత్తర కొరియా కిమ్ మాటలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రివర్స్ ఎటాక్ ఇచ్చారు. కిమ్ ...

Widgets Magazine