శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (14:34 IST)

కాంగ్రెస్ యువ నేత శపథం... రాహుల్ సారథ్యంలో నెరవేరానా?

కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తా

కాంగ్రెస్ పార్టీలో ఉన్న యువ నేతల్లో సచిన్ పైలట్ ఒకరు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి సచిన్ ఓ శపథం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ తాను రాజస్థానీ తలపాగా ధరించనన్నది ఆయన ప్రతిజ్ఞ.
 
ఈ రాష్ట్రంలో వచ్చే యేడాది (2018) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ యాత్రలో ఆయన ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పాల్గొని ప్రసంగిస్తూ... 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా విజయం సాధించక పోవడం చాలా బాధకు గురి చేసిందన్నారు.
 
తాను చేసిన శపథం ప్రకారం కార్యకర్తలు పలు కార్యక్రమాల్లో రాజస్థానీ తలపాగాను బహుమతిగా అందించినా తాను ధరించలేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చూడాలని తాను దేవుడిని ప్రార్థించానని, ఆ తర్వాతే తాను రాజస్థానీ తలపాగా ధరిస్తానని సచిన్ ప్రకటించారు.