శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (11:56 IST)

ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి.. ఫస్ట్ లుక్ అదిరింది.. (టీజర్)

తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌గా వస్తున్న చిత్రం తలైవి. ఈ సినిమాలోబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకుడు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని జూన్ 26న విడుదల చేస్తున్నారు. ఇక డీఎంకే చీఫ్ దివంగత కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అందాల హీరో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. తమిళ ప్రజల ఆరాధ్య హీరో, నాయకుడు ఎంజీఆర్ 103 జయంతి శుక్రవారం కావడంతో 'తలైవి' చిత్ర యూనిట్ సినిమా నుండి ఎంజీఆర్‌గా నటిస్తున్న అరవింద్ స్వామి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. క్లీన్ షేవ్, నల్ల అద్దాలు, రైట్ హ్యాండ్‌కు వాచ్ పెట్టుకోవడం లాంటి ఎంజీఆర్ స్టైల్‌ను అరవింద్ స్వామి దింపేశాడు. ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.