గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (16:29 IST)

నా ఆస్తి ఆర్య- లైఫ్‌ను ఎలా తీసుకెళ్లాలో చెప్పాడు - ఎనిమి ప్రీ రిలీజ్లో విశాల్‌

Enemy pre release
యాక్షన్ హీరో విశాల్, ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ కాంబినేష‌న్‌లో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ `ఎనిమి`. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ మూవీ దీపావళి సందర్భంగా న‌వంబ‌ర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో  ప్రీ రిలీజ్ ఏర్పాటు చేశారు.
 
విశాల్ మాట్లాడుతూ.. ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో మేము ఒక రూల్‌గా పెట్టుకున్నాం. ఫంక్షన్స్‌లో బోకే లాంటివి ఇవ్వడం పెట్టుకోం. అందుకు అయ్యే ఖర్చును ఆడబిడ్డల చదువుకు ఉపయోగిస్తాం. రెండేళ్ల తర్వాత ఒక ఫంక్షన్ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అన్ని సమస్యలు దాటి షూటింగ్‌లు జరుగుతున్నాయి. వినోద్‌కు థాంక్స్ చెబుతున్నాను. అతడు లేకుంటే ఎనిమి సినిమా లేదు. కరోనా టైమ్‌లో విదేశాలకు వెళ్లి షూట్ ‌చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇదే. ఈ సినిమా ఓటీటీకి మంచి ప్రాఫిట్‌తో ఆఫర్ వచ్చింది. కానీ ఆయన సినిమాను థియేటర్ విడుదల చేయలని అనుకున్నాడు. చాలా థాంక్స్ వినోద్. ఆనంద్ శంకర్‌తో ఫస్ట్ టైమ్ ట్రావెల్ అవుతున్నాను. కథ చెప్పినప్పుడు.. ఆర్య చేస్తే బాగుంటుందని, ఆ క్యారెక్టర్ ఇంకొంచెం పెంచితే బాగుటుందని అన్నాను. 
 
మమతా మోహన్‌దాస్ నేను 2007లో ఒక తమిళ సినిమా చేశాం. ఆమె నాకు మంచి ఫ్రెండ్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చూసినప్పుడు కూడా ఆమె అలానే ఉంది. టిక్‌టాక్ బ్యాన్ చేయవల్సిన పరిస్థితి తీసుకొచ్చిన మృణాళిని ఇక్కడ ఉన్నారు (న‌వ్వుతూ). ఆర్య‌ను ఇప్పుడు వదిలేస్తే ఏలూరు, గుడివాడ..వరకు కూడా సైకిల్‌పై వెళ్తాడు. సైకిల్ మీద 150 కి.మీ వెళ్తాడు. నేను కొన్నిసార్లు నిద్రపోయేది రాత్రి 2 గంటలకు. ఆర్య అప్పుడే రెడీ అవుతాడు. ఆర్య నేను జిమ్‌లో కలిశాం. అప్పుడే నేను ఆర్యతో హీరో అవుతావని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటివరకు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. నాకోసం ఎప్పుడూ ప్రార్థిస్తుంటాడు. ఆర్యను ఎప్పుడు వదిలిపెట్ట‌ను. నా ఆస్తి ఆర్య. లైఫ్‌ను ఎలా తీసుకెళ్లాలో చెప్పాడు. వాడు వీడు సినిమా ఆర్యనే ఇప్పించాడు. ఆ సినిమా చాలా ఇన్వాల్వ్ అయి చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో నాది మృణాళిని కెమిస్ట్రీ కన్నా..నాది ఆర్యదే బాగా వచ్చింది. ఆర్‌డీ రాజశేఖర్‌తో ఇది నేను చేసే మూడో సినిమా. చాలా మంది ఆందంగా కనిపించావు అని చెప్పారు. అంతా బాగా చూపించారు ఆర్‌డీ రాజశేఖర్. థమన్ సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. థియేటర్‌లో సినిమా చూడండి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్. 
 
స్నేహితుడిగా నేను పునీత్‌కు చేయగలిగింది ఇదే
పునీత్ మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పునీత్ కేవలం మంచి నటులే కాదు.. గొప్ప మనిషి. ఒక మనిషి ఇన్ని సహాయ కార్యక్రమాలు చేయగలరా? అని అనిపించింది. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లలను చదివిస్తున్నారు. ఆయన స్నేహితుడిగా నేను ఆయనకు చేయగలిగింది ఇదే. ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను. వచ్చే ఏడాది వారిని నేను నడిపిస్తాను. వారికి అండగా ఉంటాన‌ని హామీ ఇస్తున్నాను’ అని అన్నారు.
 
దర్శకుడు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఎనిమి ఒక కమర్షియల్ సినిమా. మంచి కథ కూడా ఉంది. మీ అందరికి నచ్చుతుంది. నా వైఫ్ తెలుగు. విశాల్, ఆర్యకు ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది.. కోవిడ్ వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి. కానీ మాకు ఏది కావాలో అది ఇచ్చారు. మమతా మోహన్‌ దాస్ ఈ కథ చెప్పినప్పుడు ఆమె వెంటనే ఒకే చెప్పింది. చాలా బాగా నటించింది. మృణాళిని సింగపూర్‌లో మెడిసన్ చదువుతున్న స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తుంది. ఆర్ డి రాజశేకర్ విజువ‌ల్స్ గొప్పగా చూపించారు. ఇద్దరు హీరోలు కలిసి నటించడం బాలీవుడ్‌లో జరుగుతుండేది. ఇప్పుడు సౌత్‌లో కూడా కామన్ అయింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో రాజమౌళి పెద్ద స్టార్స్‌ను పెట్టి తీస్తున్నారు. ఆర్య, విశాల్ కలిసి నటించేందుకు ముందుకు రావడం చాలా గ్రేట్. ఆఫ్ స్క్రీన్‌లో వారిద్దరు మంచి ఫ్రెండ్స్.. కానీ యాక్షన్‌కు వచ్చేసరికి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు అని అన్నారు..
 
నిర్మాత వినోద్ మాట్లాడుతూ,  కోవిడ్ కారణంగా దుబాయ్‌లో షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ సినిమాకు కొందరు ఎనిమిలు ఉన్నారు. మొదటిది కరోనా.. రెండోది ఈ సినిమాతో మొదట అసోసియేట్ అయినవారు. దుబాయ్‌లో లైన్ ప్రొడ్యూసర్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తర్వాత దుబాయ్ షెడ్యూల్‌కు లైన్ ప్రోడ్యూసర్‌గా ఉన్న మిని శర్మ చాలా హెల్ప్ చేశారు’ అని అన్నారు.
 
మమతా మోహన్‌దాస్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాల తర్వాత తెలుగు వేదికపైకి వస్తున్నా.. ఇన్నేళ్లు అయింది కదా తెలుగు మర్చిపోయాను. దయచేసి క్షమించండి. పునీత్‌కు నా నివాళులు. సినిమాల్లోకి రాకముందు నుంచే పునీత్‌తో అనుబంధం ఉంది. చాలా మంచి వ్యక్తి పునీత్. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్‌కు థాంక్స్. నా క్యారెక్టర్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌లాగా కనిపిస్తోంది. రాజమౌళి యమదొంగతో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎనిమి తెలుగులో విడుదల అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విశాల్‌తో చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాను. ఆర్యతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. క్యారెక్టర్ నేను చేస్తే ఒక మార్క్ ఉంటుందని అనుకున్నాను.. అందుకే ఈ సినిమా అంగీకరించాను అని అన్నారు.
 
మృణాళిని మాట్లాడుతూ.. ‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ తర్వాత రెండేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నాపై నమ్మకం ఉంచినందకు ఆనంద్ శంకర్‌కు, నిర్మాత వినోద్‌కు థాంక్స్. విశాల్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంది. ఆర్యతో జోడిగా ఎందుకు నటించలేదని నా ఫ్రెండ్స్ అడిగారు’ అని అన్నారు.
 
ఆర్య మాట్లాడుతూ, విశాల్‌కు నేను ఒక బ్రదర్. కథ విన్న తర్వాత ఈ పాత్రకు నేను సరిపోతాను సెలక్ట్ చేశాడు. మంచి స్టోరి లైన్, ఎమోషన్స్ ఉన్నాయి. స్నేహితులు ఇద్దరు ఎనిమిలుగా మారితే ఎలా ఉంటుంది..?. ఫిజికల్ పవర్ మాత్రమే కాకుండా మైండ్ గేమ్ కూడా ఉంటుంది. ప్రకాశ్‌రాజ్, మమతా మోహన్ దాస్, మృణాళిని అందరూ చాలా బాగా చేశారు. ఆర్‌డీ సార్ చాలా బాగా చూపించారు. హాలీవుడ్ లెవల్‌లో చూపించారు. బడ్జెట్‌కు ఏ మాత్రం వెనకాడకుండా వినోద్.. ఈ చిత్రాన్ని నిర్మించారు. నా మూవీ కేరీర్‌లో, నా జీవితంలో.. ప్రతి దానిలో చాలా కీలక రోల్ పోషించారు. వాడు వీడు తర్వాత మరోసారి కలిసి నటించాం. విశాల్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో కలిసి నటించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.