శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (13:02 IST)

రాహుల్‌ను కలిసిన పవన్ వీరాభిమాని.. ఎవరు?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సినీ నిర్మాత, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పైగా, పలువురు హీరోలతో అనేక బ్లాక్‌బ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సినీ నిర్మాత, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్ల గణేష్ బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. పైగా, పలువురు హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్ హిట్స్ చిత్రాలను నిర్మించారు.
 
నిజానికి గత కొంతకాలంగా బండ్ల గణేష్ సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. పైగా, ఈయనకు సినీ పెద్ద‌ల‌తోనేకాకుండా రాజకీయ ప్ర‌ముఖుల‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి బండ్ల గణేష్ ఇపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
మంగళవారం రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో బండ్ల గణేష్ సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా రాహుల్‌ను కలిసిన ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేసిన బండ్ల గ‌ణేష్.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 'ఇలాంటి జ‌న్మ‌దినోత్స‌వాలు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను స‌ర్‌. మీరే దేశ భ‌విష్య‌త్తు. దేవ‌డు మిమ్మ‌ల్ని కాపాడాలి' అంటూ ట్వీట్ చేశారు.