Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సల్మాన్ ఖాన్‌ పెళ్లి చేసుకోకుండానే తండ్రి కావాలి: రాణి ముఖర్జీ

శనివారం, 6 జనవరి 2018 (17:17 IST)

Widgets Magazine

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ వివాహంపై బిటౌన్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్‌నే సల్మాన్ ఖాన్ వివాహం చేసుకుంటాడని బిటౌన్‌లో జోరుగా చర్చ సాగుతోంది. సల్మాన్ సోదరి వివాహానికి కత్రినా వచ్చినప్పటి నుంచి రణ్‌బీర్ కపూర్‌‌తో బ్రేకప్ అయ్యింది. ఆపై సింగిల్‌గా వున్న కత్రీనా కైఫ్ సల్మాన్‌కు చేరువైంది. 
 
ప్ర‌స్తుతం ఈ భామ స‌ల్మాన్‌కు జోడీగా టైగ‌ర్ జిందా హైలో న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని సుల్తాన్ ఫేమ్ అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ మళ్లీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకునే వీలుందని బిటౌన్ సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు అతని స్నేహితురాలు, నటి రాణి ముఖర్జీల మధ్య ఆసక్తికరమైన సలహా ఇచ్చింది. సల్మాన్ పెళ్లి చేసుకోరాదని, కానీ  తండ్రి కావాలని చెప్పింది. బాలీవుడ్‌లో పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. నటి సుష్మితాసేన్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. తుషార్ కపూర్, కరణ్ జొహార్‌లు ఐవీఎఫ్, సరోగసీ విధానం ద్వారా తండ్రులు అయ్యారు. ఇదే మాదిరే సల్మాన్‌ను కూడా తండ్రి కావాలంటూ రాణి సలహా ఇచ్చింది. 
 
అలా జరిగితే తన కుమార్తె అదిరాకు సల్మాన్ బిడ్డ మంచి ఫ్రెండ్ అవుతుందని తెలిపింది. సల్మాన్ బేబీ ఆయనలాగే అందంగా ఉంటుందని రాణి ముఖర్జీ వెల్లడించింది. తన తాజా సినిమా 'హిచ్కి' ప్రమోషన్ కోసం సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్-11కు రాణి వచ్చింది. ఈ సందర్బంగా సల్మాన్‌కు ఈ సలహా ఇచ్చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్ అధినేత ఆదిత్య చోప్రాను రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌లకు కత్తి మహేష్ ఓపెన్ ఛాలెంజ్... వస్తారా?

కత్తి మహేష్ అదే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్ర కోసం కొత్త టెక్నాలజీ

దర్శకుడు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన ...

news

విశాల్, సమంతల ''అభిమన్యుడు'' ట్రైలర్

తెలుగు, తమిళ భాషల్లో పందెంకోడి ఫేమ్ విశాల్‌కు మంచి పేరున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ ...

news

కంగనా రనౌత్‌తో కరణ్ జోహార్.. కొత్త వివాదం తప్పదా?

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే దర్శకులు, నిర్మాతలు కాస్త జడుసుకుంటారు. ...

Widgets Magazine