Widgets Magazine

దేశానికే డ్రీమ్ గర్ల్.. ఆమెలా ఎదగాలనుకున్నాం: రోజా

అతిలోకసుందరి... ఇక లేరనే వార్తను యావత్తు దేశం జీర్ణించుకోలేకపోతోంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రేక్షకులు, అభిమానులు శ్రీదేవి లేరనే విషయాన్ని ఏమాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ఇంగ్లీష్ వింగ

selvi| Last Updated: ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (11:39 IST)
అతిలోకసుందరి... ఇక లేరనే వార్తను యావత్తు దేశం జీర్ణించుకోలేకపోతోంది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రేక్షకులు, అభిమానులు శ్రీదేవి లేరనే విషయాన్ని ఏమాత్రం ఊహించుకోలేకపోతున్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ వెండితెరను ఓ ఊపు ఊపేస్తుందనుకునేలోపే.. ఆమెను గుండెపోటు బలిగొంది. ఆమె మరణవార్తను విని.. యావత్తు సినీ ప్రపంచం షాక్ తింది.

ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణించారనే విషయం తెలియగానే చాలా బాధేసిందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమెది పెద్ద వయసు కూడా కాదని.. ఉదయం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ సమాచారం అందిందని.. చాలా ఆవేదనకు గురైయ్యానని తెలిపింది.

హీరోయిన్లందరికీ శ్రీదేవి ఒక డ్రీమ్ గర్ల్, ఒక స్ఫూర్తి అని రోజా వ్యాఖ్యానించారు. ఆమెలా ఎదగాలని తామంతా కలలుగన్నామని రోజా తెలిపారు. అలాంటి శ్రీదేవి ఇకలేరనగానే జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.


దీనిపై మరింత చదవండి :