'మహానటి' మూవీ ప‌ట్ల ఇంట్ర‌స్ట్ చూపిస్తోన్న‌ బాలీవుడ్ హీరోయిన్ రేఖ!

సావిత్రి బయోపిక్‌గా రూపొందిన‌ 'మహానటి' సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని మ‌హాన‌టి ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ డే ఈ సినిమాని సావిత్రి గారి అబ్బాయి స‌తీష్.. అమ్మాయి విజ

rekha
Srinivas| Last Modified శనివారం, 12 మే 2018 (20:01 IST)
సావిత్రి బయోపిక్‌గా రూపొందిన‌ 'మహానటి' సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని మ‌హాన‌టి ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్ డే ఈ సినిమాని సావిత్రి గారి అబ్బాయి స‌తీష్.. అమ్మాయి విజ‌య చాముండేశ్వ‌రి విజ‌య‌వాడ‌లో చూసారు. తమ తల్లి జీవితాన్ని నిజాయితీగా తెరకెక్కించిన చిత్రమంటూ తమ మనసులోని మాటను చెప్పారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.... బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ మ‌హాన‌టి సినిమాను చూడాలనుకుంటున్నార‌ట‌. అదేంటి మ‌హాన‌టి సినిమాని రేఖ చూడాల‌నుకోవ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? రేఖకి .. సావిత్రి పిన్ని అవుతుంది. జెమినీ గణేశన్ భార్య పుష్పవల్లికి రేఖ, రాధ అనే ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఆ తరువాతనే ఆయన సావిత్రిని వివాహం చేసుకున్నాడు. 
 
తన తండ్రి జీవితంతో ముడిపడిన సినిమా కావడం వలన, తాను చూడాలనుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని తన సోదరి రాధ ద్వారా ఆమె దర్శకనిర్మాతలకు కబురు పంపించార‌ని తెలిసింది. త్వరలోనే రేఖ కోసం మ‌హాన‌టి స్పెషల్ షో ఏర్పాటు చేస్తారేమో...!దీనిపై మరింత చదవండి :