బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (13:58 IST)

సినీ నటి కాళ్లు - చేతులు - మొండెం దొరికింది.. తల ఎక్కడ?

ఇటీవల చెన్నై నగరంలో దారుణ హత్యకు గురైన సినీ నటి సంధ్య తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 18 యేళ్ళపాటు కాపురం చేసిన తర్వాత తన భర్త నుంచి విడాకులు కోరింది. ఇద్దరు పిల్లల భవిష్యత్‌ గురించి ఆలోచన చేయకుండా విడాకులు కోరడాన్ని జీర్ణించుకోలేని ఆమె భర్త, తమిళ సినీ దర్శకుడు బాలకృష్ణన్ తన ఇంట్లోనే దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఒక్కే ముక్కను ఒక్కో ప్రాంతంలో ఉన్న చెత్తతొట్టిల్లో పడేశారు. కొన్ని భాగాలు పెరుంగుడిలోని చెత్త డంపింగ్ యార్డులో పడేయగా, అవి పారిశుద్ధ్య కార్మికుల కంట పడ్డాయి. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా, చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా హత్యకు గురైంది సంధ్యగా గుర్తించారు. 
 
ఆ తర్వాత కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో పోలీసులు అసలు విషయ వెల్లడైంది. హత్యకు గురైంది సినీ నటి సంధ్యగా గుర్తించారు. ఈమె సినీ దర్శకుడు బాలకృష్ణన్ భార్యగా గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు సంధ్య కాళ్లు, చేతులు, మొండెం దొరికినా ఇంకా తల లభించలేదు. దానికోసం పలు చోట్ల గాలిస్తున్నారు. వారం రోజులుగా గాలించినా ఫలించకపోవడంతో లై డిటెక్టర్‌ సాయంతో బాలకృష్ణన్‌ను విచారించి సంధ్య తలను విసిరేసిన ప్రాంతాన్ని కనుగొనాలని భావిస్తున్నారు.