Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పట్టాలెక్కిన "సైరా"... అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్

బుధవారం, 6 డిశెంబరు 2017 (11:19 IST)

Widgets Magazine
chiranjeevi

మెగాఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ "సైరా నరసింహా రెడ్డి". మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎపుడో ప్రారంభమైనప్పటికీ సెట్స్‌పైకి వెళ్లడంలో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చిరు కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్మాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్ వేయ‌గా ఇందులో చిరుతో పాటు ప‌లువురు విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీకరించిన‌ట్టు స‌మాచారం. 
 
స్టైలిష్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి హీరో రాంచ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమా టీంని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది. అయితే ఇందులో సంగీత దర్శకుడిగా ఎస్ థమన్, ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవివర్మన్‌ను తీసుకున్నారు. 
 
ఈ చిత్రాన్ని సుమారు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి వంటివారు ప్రధాన పాత్రలు పోషించనున్న సంగ‌తి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Chiranjeevi Regular Shooting Start Sye Raa Narasimha Reddy

Loading comments ...

తెలుగు సినిమా

news

దిల్ రాజుకు నో చెప్పిన సాయిపల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి తాజాగా నానితో మిడిల్ క్లాస్ ...

news

రాజమౌళి సినిమాలో చెర్రీ హీరో... ఎన్టీఆర్ విలన్..?

బాహుబలి మేకర్ జక్కన్న రాజమౌళి తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ ...

news

వెంకీ సినిమాలో మోగనున్న బాహుబలి సైరన్?

సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తాజాగా తేజతో చేతులు కలిపాడు. నయనతారతో బాబు బంగారంతో హిట్ ...

news

ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం

ఐటీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వివిధ టెక్ కంపెనీలకు ప్రతిష్టాత్మకంగా భావించే ...

Widgets Magazine