Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'సైరా' కోసం యోధుడిలా శ్రమిస్తున్న 'మెగాస్టార్'

సోమవారం, 4 డిశెంబరు 2017 (18:49 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' తర్వాత ఆయన చేస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
megastar
 
'సైరా నరసింహారెడ్డి' అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ సినిమా గురించి రకరకాలు వార్తలు హల్‌చల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ సినిమా, చరిత్ర ప్రధానాంశంతో తెరకెక్కనుండడం వల్ల ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయంతో ఆలస్యమవుతోంది. 
 
ముఖ్యంగా, ఈ చిత్రం కోసం హీరో చిరంజీవి ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెయిన్ ఈ సినిమాకి చిరంజీవే కావడంతో తన నుంచి ఎటువంటి రీమార్క్ ఉండకూడదని చాలా కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా తన ఫిటెనెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 
 
ఈ సినిమా కోసం మెగాస్టార్ చాలా కష్టపడుతున్నారు. రీసెంట్‌గా దర్శనమిస్తున్న ఈ ఫొటోని చూస్తుంటే చిరు ఎంత కష్టపడుతున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. 60 యేళ్ల వయసు దాటినా కూడా చేయబోతుంది యోధుడి పాత్ర కావడంతో.. ఆ లుక్ కోసం యోధుడిలా కష్టపడుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు సరిపడ బాడీ షేప్‌ను చిరు ఇప్పటికే పొందినట్లుగా ఈ ఫొటో చెప్పేస్తోంది
 
ఈ చిత్రం షూటింగ్ ఈనెల 6వ తేదీ నుంచి స్టార్ట్ చేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే రెడీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్‌లో సినిమా మొదటి షూట్ జరుగనుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు శ‌శిక‌పూర్ మృతి

బాలీవుడు నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శశికపూర్ ఇకలేరు. ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన ...

news

బాబాయ్ టైటిల్‌తో అబ్బాయి సినిమా... మెగా ఫ్యాన్స్ వార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను ఓ మలుపుతిప్పిన చిత్రం "తొలిప్రేమ". తెలుగు సినీ ...

news

మాటల మాంత్రికుడి వెంటపడ్డ ఛార్మి...

డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ...

news

డబ్బులు తీసుకుని పవన్‌ను పొగడలేదు.. ఓ కూజా, మట్టిగ్లాసు పెట్టుకుని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ ...

Widgets Magazine