'సైరా' సీక్రెట్స్ వెల్లడించిన చిరంజీవి...

ఆదివారం, 14 జనవరి 2018 (12:40 IST)

sye raa chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం గత యేడాది డిసెంబరు ఆరో తేదీన సెట్స్ పైకెళ్లి తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ ప్రారంభంకావాల్సి ఉంది. 
 
చిరు కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్మాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్ జ‌రుపుకోగా, ఫిబ్ర‌వ‌రిలో రెండో షెడ్యూల్‌కి సిద్ధ‌మైంది. ఈ విష‌యాన్నిచిరు స్వ‌యంగా వెల్లడించారు. 
 
స్టైలిష్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సైరా తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రం రూపొందుతోంది. 
 
దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం పొలాచ్చి, రాజస్థాన్‌లతో పాటు ప‌లు ప్రాంతాలలోను షూటింగ్ జ‌రుపుకోనుంది. దీనిపై మరింత చదవండి :  
Chiranjeevi Updates Second Schedule Sye Raa Narasimha Reddy

Loading comments ...

తెలుగు సినిమా

news

మహిళా అభిమానిని బూతులు తిట్టిన బాలీవుడ్ హీరో (వీడియో)

వివాదాలకు ప్రత్యేక చిరునామాగా మారిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ క‌పూర్. ఈయన గురించి ...

news

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ ...

news

టచ్ చేయకుండానే రూ.లక్షల్లో గుంజేసిన తమిళ నటి శ్రుతి

తెలుగులో ఓ సామెత ఉంది. తొడ చూపించకుండానే రూ.90 వేలు సంపాదించిందన్నది ఆ సామెత. కొందరు ...

news

గౌరవ న్యాయమూర్తుల్లారా సలాం.. ప్రకాష్ రాజ్

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు.. అపెక్స్ కోర్టు పని ...