గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (13:14 IST)

Pawan Kalyan-Renu Love: రేణు దేశాయ్‌పై నిజమైన ప్రేమ లేదు.. పెళ్లి ఎందుకంటే?: గీతాకృష్ణ

Renu Desai_Pawan
Renu Desai_Pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ దర్శకుడు రేణు దేశాయ్‌పై పవన్ కళ్యాణ్‌కు నిజమైన ప్రేమ కాదని, మరో హీరోయిన్ వద్దు అని ఆమెపై కోపంతో పవన్ కళ్యాణ్‌  రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నాడని ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ దర్శకుడు ఎవరో కాదు గీతాకృష్ణ.
 
ఒకప్పుడు హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న ఈ దర్శకుడు ప్రస్తుతం సినిమాలు లేక యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ రేణులది నిజమైన ప్రేమ కాదు. బద్రి సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమీషా పటేల్‌ని పవన్ మొదట ప్రేమించారు.  
 
అయితే చివర్లో అమీషా పటేల్‌ని పెళ్లాడగానే సినిమాలు ఆపేయాలని పవన్ షరతు పెట్టాడు. కానీ అమీషా ఆ షరతుకు ఒప్పుకోకపోవడంతో అదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్ మెడలో తాళి కట్టారు. మరో హీరోయిన్‌పై పగతో రేణు మెడలో మూడు ముళ్లు వేసిన పవన్‌తో రేణు దేశాయ్‌కు పొసగలేదు.
 
రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఏకంగా పది సినిమాలు పడిపోయాయి. రేణు దేశాయ్‌కి విడాకులిచ్చాక పవన్ సినిమాలు హిట్ అయ్యాయి. 
 
ఆ అమ్మాయి వచ్చాక అన్నీ ఫ్లాపే.. ఆ అమ్మాయికి విడాకులిచ్చాక.. అన్నీ హిట్. అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా రేణు దేశాయ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఫ్లాప్ సినిమాలు కూడా మిగిలిన సినిమాలతో పోల్చిన ఘనత పవన్ కల్యాణ్‌ది. ఆయనకున్న క్రేజ్ అతనిది అంటూ గీతాకృష్ణ అన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.