బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 7 మే 2018 (09:44 IST)

''మహానటి''లో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు.. ఇంట్రో వీడియో ఇదో..

అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను కీర్తి సురేష్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అలనాటి తార సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను కీర్తి సురేష్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. 
 
ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు పక్కాగా ఒదిగిపోయారు. మాయాబజార్‌లో మహానటుడిని మాయా శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందిన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో డాక్టర్ మోహన్ బాబు ఒదిగిపోయి.. ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
 
మరోవైపు సావిత్రి చిన్ననాటి పాత్రలో రాజేంద్రప్రసాద్‌ మనవరాలు నిశంకర నటిస్తుండగా, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాత్రను పాప్‌ సింగర్‌ స్మిత కూతురు శివి చేస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
ఇకపోతే... కీర్తి సురేశ్‌, దుల్కర్‌సల్మాన్‌, సమంత, విజయ దేవరకొండ, షాలినీ పాండే, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు, క్రిష్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.