Widgets Magazine

జాన్విని శ్రీదేవితో పోల్చకండి.. ఆ వయసుకే ఆమె సూపర్‌స్టార్: ఫరాఖాన్

సినీతార శ్రీదేవితో ఆమె కుమార్తె జాన్విని పోల్చకండని ప్రముఖ కొరియాగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దఢక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవుతున్న జాన్వి వయస్సు నాటికే శ్రీదేవి సూపర్ స్

selvi| Last Updated: మంగళవారం, 13 మార్చి 2018 (15:02 IST)
సినీతార శ్రీదేవితో ఆమె కుమార్తె జాన్విని పోల్చకండని ప్రముఖ కొరియాగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దఢక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవుతున్న జాన్వి వయస్సు నాటికే శ్రీదేవి సూపర్ స్టార్ అయిపోయారని ఫరాఖాన్ గుర్తు చేశారు. కాబట్టి వారిద్దరి శ్రీదేవి, జాన్విల మధ్య పోలిక అవసరం లేదని తెలిపారు.

శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని.. కెరీర్‌ తొలినాళ్లలో.. ఆమె తనను ఎంతగానో ప్రోత్సహింతారని తెలిపారు. తాజాగా శ్రీదేవి కుమార్తె జాన్వి తొలి సినిమా దఢక్‌కు శ్రీదేవి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జాన్వి కూడా మంచి డ్యాన్సర్ అని.. ఏది చెప్పినా త్వరగానే నేర్చేసుకుంటుందని కొనియాడింది.

మరాఠీ చిత్రం సైరాట్ సినిమాకు రీమేక్‌గా దఢక్ తెరకెక్కుతోంది. ఇందులో హీరో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ కథానాయకుడిగా కనిపిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకుడు. జూన్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


దీనిపై మరింత చదవండి :