శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (16:02 IST)

ఎన్టీఆర్‌కు క్లాసిక్ డ్యాన్సర్, ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు మృతి

ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) తుదిశ్వాస విడిచారు. కొంతకాలం అనారోగ్యంతో బాధపడతూ వచ్చారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో మృతి చెందారు. కాగా ధర్మరాజు 20 ఏట డ్యాన్స్‌పై ప్రేమత

ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు ధర్మరాజు (97) తుదిశ్వాస విడిచారు. కొంతకాలం అనారోగ్యంతో బాధపడతూ వచ్చారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో మృతి చెందారు. కాగా ధర్మరాజు 20 ఏట డ్యాన్స్‌పై ప్రేమతో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. 
 
అనంతరం చెన్నైలో స్థిరపడిన ధర్మరాజు ఎన్టీఆర్‌, కృష్ణ, మహేష్‌బాబు, ఉదయభాను, జూ.ఎన్టీఆర్‌ స‌హా పలువురు ప్రముఖ హీరోలకు క్లాసికల్‌ డ్యాన్సర్‌గా పనిచేశారు. సినీ రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు.
 
గురువు భౌతికకాయాన్ని చూసి ప్రభుదేవా కన్నీటి పర్యంతమయ్యారు. ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ధర్మరాజు మృతితో ఆయన కుటుంబీకులకు సినీతారలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుదేవా భారత మైకేల్ జాక్సన్‌గా పేరు సంపాదించేందుకు ధర్మరాజే  కారణమని ఆయన గుర్తు చేసుకున్నారు.