శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (10:41 IST)

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. మరొకటి విలన్ క్యారెక్టర్. ఈ చిత్రానికి సంబంధ

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. మరొకటి విలన్ క్యారెక్టర్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఇటీవల విడుదలకాగా, దీనికి మంచి స్పందన వచ్చింది. 
 
రామాయ‌ణంలో రాముడికి, రావ‌ణాసురుడికి గొడ‌వ‌.. మ‌హా భార‌తంలో పాండ‌వుల‌కి , కౌర‌వుల‌కి గొడ‌వ అని చెబుతూ పుర‌ణాల‌లో వాళ్ళు చేసింది త‌ప్పే అయితే నేను చేసింది త‌ప్పే, అక్క‌డ వాళ్ళు దేవుళ్ళు అయితే ఇక్క‌డ నేను దేవుడినే. అర్థ చేసుకుంటారో , అపార్థం చేసుకుంటారో .. చాయిస్ ఈజ్ యువ‌ర్స్ అంటూ టీజ‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ పేల్చాడు మోహ‌న్ బాబు. 
 
హీరోగా.. విలన్‌‌గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం అందరికి ఇంట్రస్టింగ్‌గా వుంది. వచ్చే నెల 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. ఈ చిత్రంలో శ్రియ, నిఖిలా విమల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.