శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 జనవరి 2018 (19:03 IST)

సిద్ధరామయ్యా... ఇదేం పనయ్యా? అమ్మాయి చేయి పట్టుకుని లాగుతూ...

కర్నాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న సమావేశంలో కొందరు అమ్మాయిలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఓ అమ్మాయి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా స్టేజిపైన యాంగిల్ కుదర్లేదు. దానితో ఆమె సిద్ధరామయ్యకు కుడివైపుకు వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్

కర్నాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న సమావేశంలో కొందరు అమ్మాయిలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఓ అమ్మాయి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా స్టేజిపైన యాంగిల్ కుదర్లేదు. దానితో ఆమె సిద్ధరామయ్యకు కుడివైపుకు వెళ్లి సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించింది.
 
ఐతే హఠాత్తుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమె చేయి పట్టుకుని తన సమీపానికి లాగడంతో ఆమె బిత్తరపోయింది. తనకు సమీపంలో నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ఆయన సూచనగా ఆయనలా చేయి పట్టుకుని లాగారు. దీనిపై నెట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మహిళల పట్ల సిద్ధరామయ్య ప్రవర్తన దారుణంగా వున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.