Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెర్రీకి అన్నయ్యగా ప్రశాంత్.. మరి స్నేహ జోడీగా నటిస్తుందా?

శనివారం, 20 జనవరి 2018 (16:27 IST)

Widgets Magazine

రామ్‌చరణ్, బోయపాటి శీను కాంబినేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో బలమైన విలన్‌గా వివేక్ ఒబెరాయ్ కనిపించనుండగా, హీరోయిన్‌గా కైరా ద్వానీ నటిస్తోంది. కీలక పాత్రలో స్నేహ నటించనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ నటించనున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
శంకర్ దర్శకత్వంలోని 'జీన్స్' సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రశాంత్, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ చెర్రీ సినిమాలో కనిపించనున్నాడు. ఇందులో ప్రశాంత్ చెర్రీకి అన్నయ్యగా నటిస్తాడని సమాచారం. ఇక స్నేహ ప్రశాంత్ సరసన నటిస్తుందని టాక్. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
రామ్‌చరణ్‌, కైరా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Prashanth Sneha Kollywood Boyapati Srinu Ram Charan

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆచారి అమెరికా యాత్ర టీజర్ వైరల్.. రిపబ్లిక్ డేకి విడుదల

మంచు విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల ...

news

''ధడక్'' ద్వారా శ్రీదేవి కుమార్తె ''జాహ్నవి'' తెరంగేట్రం..

అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి తెరంగేట్రానికి వేళైంది. మరాఠీలో ...

news

వర్మను విమర్శించడం ఎందుకు.. ప్రభాస్ పెళ్లి గురించి?: కృష్ణంరాజు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని ...

news

పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ సెల్పీలు... స్వీట్లు కూడా తినిపించుకున్నారు

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ...

Widgets Magazine