Widgets Magazine

'గరుడవేగ' కోసం కోట్ల ఆస్తి తాకట్టు... అందుకే 'జెంటిల్‌మెన్' వదులుకున్నా... రాజశేఖర్

సోమవారం, 6 నవంబరు 2017 (14:09 IST)

Rajasekhar

గరుడవేగ చిత్రం సక్సెస్ బాటలో నడుస్తుండటంతో హీరో రాజశేఖర్ కు ఊపిరి వచ్చినట్లయింది. ఈ చిత్రం విడుదల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని విడుదల చేసే సమయంలో రూ. 3 కోట్లు మేర తీసుకున్న ఫైనాన్షియర్ ఒకరు మోకాలడ్డటంతో చేసేదిలేక రాజశేఖర్ తన విలువైన స్థలాన్ని తాకట్టు పెట్టి మరీ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద రాజశేఖర్ నమ్మకం వమ్ముకాలేదు.
 
ఇకపోతే కెరీర్లో తను కూడా ఎన్నో గోల్డెన్ ఆఫర్స్ వదులుకున్నట్లు చెప్పారు. తమిళ స్టార్ డైరెక్టర్ జెంటిల్ మెన్ కథ తనకే ముందు చెప్పారనీ, కానీ అందులో నటించేందుకు డేట్స్ ప్రాబ్లమ్ వల్ల చేయలేకపోయినట్లు చెప్పారు. ఆ సమయంలో అల్లరి ప్రియుడు చిత్రాన్ని చేస్తున్నాననీ, కొందరిలా డేట్స్ అడ్జెస్ట్ చేయగల నైపుణ్యం తనకు లేదని వెల్లడించారు. 
 
ఇక ఇటీవల తన కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవమేననీ, ఆ సమయంలో కొందరు తనను విలన్ పాత్రలు చేయాలని కోరినట్లు వెల్లడించారు. విలన్ పాత్రలు కూడా మంచి ప్రాముఖ్యత వున్న పాత్ర అయితే చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద ఇన్నాళ్లకు రాజశేఖర్ మళ్లీ పుంజుకున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రూ.1000 కోట్లతో పౌరాణిక చిత్రం... హీరోలు ఎవరంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త ...

news

చెన్నైలోని ఎన్టీఆర్ నివాసాన్ని అమ్మేస్తారా? గండిపేట కుటీరంపై లక్ష్మీపార్వతీ ఏమన్నారు?

లెజెండరీ నటుడు, తెలుగు తెరకి స్టార్ స్టేటస్ తెచ్చిన తొలితరం హీరో, అంతకుమించి ఆనాటి ...

news

'గరుడవేగ' హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తెపై కేసు

'పీఎస్వీ గరుడవేగ' చిత్రం విజయోత్సవంలో మునిగితేలుతున్న హీరో రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌ ...

news

ఆగలేకపోతున్నా... రిలీజ్ చేయండి ప్లీజ్ అంటున్న హీరో

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం ...