టీ సప్లై చేసే కుర్రాడి పేరు కూడా జక్కన్నకు గుర్తే: అదిరే అభి కితాబు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళిపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటులలో ఒకరైన అదిరే అభి ప్రశంసలు గుప్పించాడు. దర్శకత్వంపై తనకు ఆసక్తి వుందని.. ఈ క్రమంలో ''బాహుబలి 2'' టీమ్ అనుమత

rajamouli
Selvi| Last Updated: శనివారం, 14 జులై 2018 (11:52 IST)
బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళిపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటులలో ఒకరైన అదిరే అభి ప్రశంసలు గుప్పించాడు. దర్శకత్వంపై తనకు ఆసక్తి వుందని.. ఈ క్రమంలో ''బాహుబలి 2'' టీమ్ అనుమతితో ఆ సినిమా షూటింగును చాలా దగ్గరగా చూశానని చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో, సెట్లో రాజమౌళి ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారన్నారు. 
 
అన్నీ విషయాలను దగ్గరుండి పరిశీలిస్తుంటారని.. ప్రొడక్షన్‌లో టీ సప్లై చేసే కుర్రాడి పేరు కూడా ఆయనకు గుర్తుంటుందని.. అభి చెప్పాడు. దాదాపు రాజమౌళి ఆయన పనిని ఆయనే చూసుకుంటారని.. ఇతరులకు అప్పగించరని.. రాజమౌళి సెట్లో వుండే వారి పేర్లను గుర్తుచేయాలనుకోవడం ఎంత అమాయకత్వమవుతుందో తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. 
 
జక్కన్నకు సెట్ అసిస్టెంట్ నుంచి కాస్ట్యూమ్ అసిస్టెంట్ వరకూ పేర్లతో సహా తెలుసు. అంతమందిలో ప్రతి ఒక్కరి పేరును గుర్తుపెట్టుకుని పిలుస్తారని తెలిపాడు. బాహుబలి షూటింగ్‌ను పక్కనుండి చూసి.. ఆ తర్వాత సినిమా చూడగానే తనకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతాకాదు. కీరవాణి గారి ఫ్యామిలీతో తనకు బాగా పరిచయం వుంది. 'ఛత్రపతి' సినిమా నుంచి తాను వాళ్లను కలవడం జరుగుతూ ఉండేది. బాహుబలి షూటింగ్ చూసి ఎంతో నేర్చుకున్నానని అభి తెలిపాడు. దీనిపై మరింత చదవండి :