సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన సినిమాల గురించి తన కుటుంబం గురించి పలు విషయాలను శుక్రవారంనాడు చిట్‌చాట్‌గా వెల్లడించారు. బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన వ్యవహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో 250వ బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బిగ్ సి ప్రతినిధులు మాట్లాడుతూ, 2007లోనే 100 స్టోర్స్ గా చేయాలనుకున్నాం. అప్పటినుంచి మహేష్‌బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా అనుకున్నాం. కానీ అప్పటినుంచి సాధ్యపడలేదు. మరో హీరోతో ఆలోచన లేకుండా మహేష్‌తో చేయాలనుకున్నాం. ఎట్టకేలకు విధి 2021లో 250 స్టోర్స్ ఏర్పడ్డాక ఆయన్ను మాకు ఇచ్చేలా చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు పలు ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం చెప్పారు.
మీరు మొదట వాడిన ఫోన్ ఏ కంపెనీతో గుర్తుందా?
నోకియా ఫోన్ వాడాను. క్లాసికల్ మోడల్ అది.
మీరు ఫోన్ చూడగానే ఫస్ట్ చూసేది ఏమిటి?
వాట్సప్ ఓపెన్ చేస్తా. నా ఫ్యామిలీ అప్‌డేట్స్ ఏమైనా పెట్టారో అని చూస్తాను.
మీ పిల్లలకు ఫోన్ అలవాటు చేశారా? వద్దని వారించలేదా?
ఫోన్ అనేది ఇప్పుడు అవసరం అయింది. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాస్‌లు కావడంతో మార్నింగ్ రెండు గంటలు ఈవెనింగ్ రెండు గంటలు పోన్ వాడమని చెబుతుంటాను.
సహజంగా ఇద్దరు పిల్లుంటే కొట్టుకుంటూ నాకంటే నాకు డాడీ ఇష్టమన్న సందర్భాలున్నాయా?
నాకు ఇద్దరంటే ఇష్టం. వారికి నేనంటే ఇష్టం. ఇప్పుడంతా బాగానే వున్నాం. లేనిపోని అనుమానాలకు తావివ్వవద్దు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. (నవ్వుతూ)
ఇప్పటి ట్రెండ్‌లో ఫోన్ లగ్జరీనా? నెససరీనా?
ఇప్పటి పరిస్థితులలో ఫస్ట్ లగ్జరీ. తర్వాత నెససరీ..
పాండమిక్ ఏమి నేర్పించింది?
చిన్న చిన్న బేసిక్ విషయాలు ఇంపార్‌టెంట్ అని చెప్పింది. పిల్లలతో, భార్యతో గడపడం అనేది నేర్పింది. జీవితం అనేది గ్రాండ్‌గా తీసుకోకూడదనేది అర్థమైంది.
మీరు ఏ బేసిక్‌పై బ్రాండ్‌ను ఎంచుకుంటారు?
బ్రాండ్ అనేది నా ఇమేజ్‌కు సరిపడా వుండాలని చూస్తాను. బిగ్ సి అనేది అనదర్ ఎచీవ్‌మెంట్.
రెండు రోజులు ఫోన్ లేకపోతే ఏం చేస్తారు?
నేను అంతలా ఫోన్‌కు అడిక్ట్ అయిపోలేదు. లేకపోయినా పెద్దగా పట్టించుకోను. నా పిల్లలకు కూడా అవసరమైనప్పుడు ఉదయం, సాయంత్రం రెండు గంటలే చూడాలని చెప్పాను కూడా.
కొత్త ఫోన్‌లు మారుస్తుంటారా?
కొత్తగా వచ్చినప్పుడు మార్చేస్తుంటాను.
సర్కారివారి పాట ఎంత వరకు వచ్చింది?
దాదాపు ఏడాదిపాటు షూటింగ్ చేశాం. ఇప్పటికి 70శాతం పూర్తయింది.
నిన్న దూకుడు 10ఏల్ళ అయినా జనాలు బాగానేచూశారు?
అవును. పదేళ్ళు అయినా ఇంకా అభిమానులు హౌస్‌ఫుల్‌తో చూడడం నాకు ఆనందంగా వుంది. ఇదంతా నాన్నగారి అభిమానులు, నా అభిమానులు వల్లే సాధ్యపడింది. ఆంధ్రలో ఒక పండుగలా థియేటర్‌లో వున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి వుంటాను.
మొబైల్ బ్రాండ్ సెలక్షన్ మీదా? నమ్రతదా?
మొబైల్ బ్రాండ్ సెలక్షన్.. నేను చేస్తాను. నమ్రత మేనేజ్ చేస్తుంది.
మీ ఎనర్జీ సీక్రెట్ ఏమిటి?
ఆల్ ది టైమ్ హ్యపీగా వుండం. ఒత్తిడలేకుండా వుంటాను అదే ఎనర్జీ సీక్రెట్.
రియాల్టీ షోకు గెస్ట్‌గా రాబోతున్నారుగదా. ఆ వివరాలు చెబుతారా?
అది త్వరలో వారే చెబితే బాగుంటుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా ఎప్పుడు?
ఈ ఏడాదిలో ప్రారంభమవుతుంది.
రాజమౌళితో సినిమా అన్నారు. ఎంతవరకు వచ్చింది?
రాజమౌళిగారితో మేం కొలాబ్రేట్ అవ్వబోతున్నాం. చాలా ఆనందంగా వుంది. త్వరలో వివరాలు తెలియజేస్తాం.
మీ ఫేవరేట్ సినిమా ఏది?
నాన్నగారి నటించిన అల్లూరి సీతారామరాజు.
టీవీ చూస్తుంటారా?
అవును. నేను టెవివిజన్ మూవీస్ చూస్తాను. స్ట్రెస్ కోసం చూస్తాను.
ఇప్పటి జనరేషన్ ఫోన్‌తో ముడిపడివుంది? ఇది కరెక్టే అంటారా?
సాంకేతిక ఎంత అభివృద్ధిచెందిన దాన్ని లైట్‌గా తీసుకోవాలి. ఇప్పటి జనరేషన్ ఫోన్ల ద్వారా వచ్చిన ట్విటర్ గానీ, ఇన్ స్ట్రా గానీ ఇలా అన్నింటిని యూజ్ చేస్తున్నారు. ఈజీ అయిపోయింది. అందుకే లైట్‌గా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు.
వెబ్ సిరీస్ చేసే ఆలోచన వుందా?
నేను వెబ్ సిరీస్ చూస్తుంటాను. చేసే టైం వస్తుందని అనుకోలేదు. కానీ చెప్పలేం. ఇప్పటికి అయితే ఆ ఆలోచన లేదు.
సితారతో కలిసి నటిస్తారా?
నటించాలంటే నెర్వస్‌గా వుంటుంది. యాడ్ వరకు అయితే ఓకే.
సితార నటిస్తే ఏ సినిమాలో నటిస్తుంది?
షి వాంట్స్ యాక్ట్ ఇంగ్లీషు మూవీస్. తెలుగు చేయదు. ఎందుకంటే ఆమె ఆలోచనలు అలా వున్నాయి. ముందు చదువు ముఖ్యం. ఇప్పుడు 9 సంవత్సరాలు. 14,15 ఏళ్ళు వచ్చాక ఆలోచించాలి. తనకు జోకింగ్ ఫ్రోజన్ ఫిలింస్ అంటే ఇష్టం.
నమ్రతతో కలిసి నటించే అవకాశం వుందా?
ఇంతవరకు ఆలోచన లేదు.